సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీలో ఎరువులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ప్రశ్నించారు. సమయానికి ఎరువులు అందక రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కుప్పంలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారని, ఇది చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఎరువుల కొరతపై జగన్‌ విమర్శలు..

జగన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు ఎప్పుడైనా రోడ్డెక్కారా అని ప్రశ్నించారు. తమ కాలంలో రైతులకు ఇలాంటి ఇబ్బంది రాలేదని.. అదే అధికారులు ఉన్నా, అప్పట్లో సమస్య రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తోంది?" అని వ్యాఖ్యానించారు. రైతులకు కావాల్సిన ఎరువులను ముందే అంచనా వేసి అందించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు స్కామ్‌లలో పడిపోయిందని ఆరోపించారు.

ys-jagan-shocking-comments-on-cm-chandrababu-over-urea

యూరియా విషయంలోనే రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని.. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువులను టీడీపీ నేతలు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ఆర్బీకేలు, ఈ-క్రాప్‌ వంటి రైతులకు సహాయపడే వ్యవస్థలను నిర్వీర్యం చేశారని జగన్‌ అన్నారు. వైసీపీ హయాంలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకునేవాళ్లని.. కానీ ఇప్పుడు చంద్రబాబు దగ్గరుండి స్కామ్‌లను నడిపిస్తున్నారన్నారు. ఇలాంటివి చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు.

అలానే ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రైవేట్‌ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారని.. కానీ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా? ప్రజలకు వైద్య విద్య అవకాశాలు పెంచే మెడికల్‌ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫైర్ అయ్యారు. 2019కి ముందు రాష్ట్రంలో కేవలం 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని చెప్పారు.

చంద్రబాబు పాలనలో రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అన్నివిధాలా ఇబ్బందులు పడుతున్నారని.. చిత్తశుద్ధి లేని పాలన వల్లే రాష్ట్రం ఇలాంటివి చూస్తోందని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, వైద్య రంగంలో చరిత్రాత్మక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+