లోకేష్ ఎఫెక్ట్: జైలుకే... జగన్‌ని ఇరుకున పెట్టిన కెఈ, రాబందుల రాజ్యం: వాసిరెడ్డి

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు. తద్వారా జగన్‌ను ఇరుకున పడేశారు. సోమవారం నాడు కెఈ విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లవలసిందేనని టెప్పారు.

వందేళ్లైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించిన విషయాన్ని ఆధారంగా చేసుకొని జగన్‌కు సవాల్ విసిరారు. జగన్ తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జగన్ మొసలి కన్నీరు: పల్లె

వైసిపి ఆధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పల్లె రఘునాత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని ఆందోళనలు చేసినా జగన్ ఏం సాధించలేరని ఎద్దేవా చేశారు.

YS Jagan should announce his assets: KE Krishnamurthy

మంచి కార్యక్రమాలను ప్రజలు ప్రోత్సహించాలి: అచ్చెన్నాయుడు

మంచి కార్యక్రమాలను ప్రజలు ప్రోత్సహించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల కోసం రూ.24వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు.

అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం బెల్టు షాపులను పెంచి పోషిస్తోందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా మండిపడ్డారు. బెల్టు షాపుల వల్ల కుటుంబాల్లో చిచ్చు రేగుతోందన్నారు. బాంధవ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. బెల్టు షాపులను రద్దు చేయాలని మహిళలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

బెల్టు షాపుల వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల ముడుపులు అందుతున్నాయన్నారు. సోమవారం ఆయన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. రాష్ట్రంలో వెంటనే బెల్ట్ షాపులను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఒకవేళ బెల్టు షాపులను రద్దు చేయకపోతే, వచ్చే నెల 10వ తేదీ నుంచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో రాబందుల రాజ్యం సృష్టిస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏపీలో కడుతోంది.. స్వదేశీ రాజధానా లేక విదేశీ రాజధానా చెప్పాలన్నారు. సింగపూర్ సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు మనసులేని సీఎం అన్నారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలియదా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+