జగన్ తప్పుకోవాల్సిందే, లేదంటే తప్పుడు సంకేతాలు: సోమిరెడ్డి ఫైర్

Subscribe to Oneindia Telugu

అమరావతి: సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్.. పార్టీ అధ్యక్ష, ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తప్పుకొని వేరొకరికి అప్పగించాలని ఆయన అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

  జగన్ పాదయాత్ర : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | Oneindia Telugu

  12 కేసులు ఉన్న వ్యక్తి దేశంలో ఎక్కడా పార్టీ అధ్యక్షుడిగా లేరని, దీని వల్ల క్రిమినల్స్‌, ముద్దాయిలు కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని సోమిరెడ్డి అన్నారు. యువతపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఇప్పటికైనా ఆలోచించాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.

  పాదయాత్రకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం కూడా ఆయనకో గుణపాఠమని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
  ఇది ఇలావుండగా, వ్యవసాయశాఖ, వ్యవసాయ, అయోవా విశ్వవిద్యాలయం, వ్యవసాయ ఉత్పత్తిదారుల సహకారంతో కర్నూలులో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక విత్తన పరిశోధన కేంద్రానికి మొదటివిడతగా ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించిందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.

  YS Jagan should resign all positions in Party and opposition leader's post, says somireddy

  ముఖ్యమంత్రితో కలిసి అయోవా విశ్వవిద్యాలయంలో అత్యాధునిక విత్తన పరిశోధన కేంద్రాన్ని పరిశీలించినట్లు తెలిపారు. 300 రకాల విత్తనాలు, మరో 350 రకాల విత్తనాలపై వచ్చే తెగుళ్లపై అక్కడ పరిశోధనలు చేస్తున్నారని వివరించారు.

  తమ పర్యటనలో ఒకే రైతు 9 వేల ఎకరాల్లో పంటలు పండించడం చూశామన్నారు.
  కాగా, రాష్ట్రంలో మూడో విడత కింద ఇప్పటివరకు 7.89 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.761.94 కోట్ల రుణ మాఫీ, పది శాతం వడ్డీ కింద మరో రూ.152.39 కోట్లు జమ చేశామని మంత్రి సోమిరెడ్డి వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh minister Somireddy Chandramohan reddy on Monday said that YSRCP president YS Jaganmohan Reddy should resign his all positions in Party and opposition leader's post.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి