'బడ్జెట్‌లో చంద్రబాబు మార్క్, జగన్ ఆస్తులు ప్రకటించేందుకు మరో పదేళ్లు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించాలంటే మరో పదేళ్లు పడుతుందని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించాలంటే మరో పదేళ్లు పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం నాడు అన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్క్ ఉందని వర్ల అన్నారు. జగన్ అక్రమాస్తులను కేంద్రం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులను ప్రకటించేందుకు జగన్‌కు అంత భయం ఎందుకో చెప్పాలన్నారు.

YS Jagan should reveal his assets: Varla

జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: సూర్యనారాయణ

ప్రజల మేలు కోసం ప్రభుత్వం చేపట్టే పనులను విపక్ష నేత వైయస్ జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.

జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు హంద్రినీవా పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తుంటే ఈ నెల ఆరో తేదీన జగన్ ఉరవకొండలో సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత ప్రయోజనాల కోసం జగన్ రెచ్చగొట్టే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇరవై శాతం పనులు చేసి, 80 శాతం బిల్లులు వసూలు చేసుకుని వదిలివేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పుడు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నారన్నారు. జగన్ తన ఉనికిని కోల్పోయారని, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+