చంద్రబాబు పాలనలో ఏపీ ఎంత అప్పుల పాలైందో.. కాగ్ షాకింగ్ లెక్కలు చెప్పిన జగన్

ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఆదాయం తగ్గిపోతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని స్థాయిలలో అవినీతి పెరిగిపోవడమే ఈ స్థితికి కారణమని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్ధిక దుస్థితిని చెప్పిన జగన్
కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని వివరించారు. టిడిపి కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల కాలంలోనే రూ.1,86,361 కోట్ల అప్పు చేసిందని జగన్ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పులో ఇది 56 శాతానికి సమానమని జగన్ పోల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెప్పారని, అప్పులను తగ్గిస్తామని చెప్పారన్నారు.

ys jagan slams chandrababu govt over ap financial position with cag report

Take a Poll

రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు తగ్గిందన్న జగన్
ఆ హామీలను విస్మరించి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంత భారీగా అప్పులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.ఇక రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు పైన ఆందోళన వ్యక్తం చేసిన జగన్ 2024 25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధి కేవలం 3.08 శాతంగా నమోదు అయిందని పేర్కొన్నారు.

ఏపీ ఆర్ధికంగా మందగమనంలో
దేశం యొక్క gdp వృద్ధి 9.8శాతంగా, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి 12.04శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆదాయ వృద్ధి ఇంత తక్కువగా ఉండడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఇది ఏపీ ఆర్థిక మంద గమనానికి సూచిక అంటూ జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 12.02శాతం వృద్ధి చెందుతోందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

చంద్రబాబు పాలన విధానాలపై పునరాలోచించాల్సిన అవసరం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు అని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జిఎస్టి, సేల్స్ టాక్స్ వసూళ్లు కూడా బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాబడి తగ్గిపోయిందని, అప్పులు పెరిగిపోయాయని చెప్పిన జగన్ ప్రభుత్వం తన పాలన విధానాలపై తీవ్రంగా పునరాలోచించాల్సిన అవసరం ఉందంటూ హితవు పలికారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట పడేయడానికి తగిన నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద భారం పడకుండా కాపాడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+