చంద్రబాబు అస్త్రాన్నే వాడేస్తున్న జగన్ ? కేబినెట్, కొత్త జిల్లాల సక్సెస్ మంత్ర-భవిష్యత్తులో మరింతగా
ఏపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో రాజకీయ నేతలు అమలు చేసిన పథకాలనో, కార్యక్రమాలనో, నిర్ణయాలతో అమలు చేయడమనే సంస్కృతి నుంచి ఇప్పుడు అంతకు మించిన సక్సెస్ మంత్రాల్ని వెతుక్కుంటున్నాకరు. ఇందులో అధికార పక్షాలు సైతం ఒకప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షాలైన వారి నుంచి ఇలాంటి సక్సెస్ మంత్రాల్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా వైసీపీ కూడా అదే చేస్తోంది. ఇందులో సక్సెస్ లభించడంతో ఇక అన్నివిషయాల్లోనూ దాన్ని అమలు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.

రూటు మారుస్తున్న వైసీపీ
గతంలో ఏపీలో విపక్షంగా ఉండగా చివరి నిమిషం వరకూ అన్ని నిర్ణయాల్నీ గోప్యంగా ఉంచుతూ, ఎవరికి ఏం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో అన్నీ సీక్రెట్ గా ఉంచుతూ సీక్రెట్ పార్టీగా పేరు తెచ్చుకున్న వైసీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తోంది. గతంలో లీకులకు దూరంగా ఉన్న వైసీపీ ఇప్పుడు కాస్తా ప్రతీ విషయాన్నీ లీక్ చేస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త జిల్లాల విషయంలోనూ ఈ ఫార్ములా అమలు చేసి వైసీపీ సక్సె అయింది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని అంశాల్లో ఈ లీకుల సంస్కృతి కొనసాగించేలా కనిపిస్తోంది.

కేబినెట్ లీకులు సక్సెస్
ఏపీ కేబినెట్ లో దాదాపు 80 నుంచి 90 శాతం మంది మంత్రులు రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయ్యాక తప్పుకుని మరో 25 మందికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని గతంలో సీఎం జగన్ వారికి చెప్పారు. దీంతో సదరు మంత్రులు రెండున్నరేళ్ల పదవీకాలానికి ప్రిపేర్ అయిపోయారు. అయితే అనూహ్యంగా వారికి నాలుగు నెలల అదనపు పదవీకాలం లభించింది. ప్రభుత్వం కూడా కేబినెట్ విస్తరణ రేపో మాపో అంటూ లీకులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో మంత్రులతో పాటు వారి అనుయాయులు కూడా ప్రిపేర్ అయిపోయారు. అలాగే కొత్త మంత్రుల్లోనూ ఓ మేరకు అవగాహన ఏర్పడింది. ఇది అంతిమంగా కేబినెట్ ప్రక్షాళనకు పాత,కొత్త మంత్రులు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఇందులో వైసీపీ పూర్తిగా సక్సెస్ అయింది.

కొత్త జిల్లాలపైనా అదే బాట
కొత్త జిల్లాల విషయంలోనూ వైసీపీ సర్కార్ అదే లీకుల బాట పట్టింది. ఎన్నికలకు ముందే 25 పార్లమెంటు స్ధానాలు కాస్తా 26 జిల్లాలు అవుతాయని ప్రకటించిన జగన్.. ఆ తర్వాత వాటిపై మరింత క్లారిటీ ఇస్తూ వచ్చారు. చివరికి జిల్లాల పునర్విభజన ప్రక్రియపైనా నెలకొన్న అనుమానాలను అధికారులు, వైసీపీ నేతల సాయంతో లీకులిస్తూ జనాన్ని ప్రిపేర్ చేశారు. జిల్లాల విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చి మరీ కొత్త జిల్లాల ఏర్పాటు చేసేసింది. దీనిపై విపక్షాలు ఇప్పుడు మొత్తుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్దితి. ఇక్కడా లీకులతో జగన్ సర్కార్ సక్సెస్ అయింది.

నాడు చంద్రబాబు-నేడు జగన్ ?
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీకి సంబంధించిన కీలక అంశాలు లీకవుతూనే ఉంటాయి. చంద్రబాబు మనసులో ఏముందో కింది స్ధాయి నేతలు కూడా చెప్పేస్తుంటారు. పార్టీ వ్యూహాలపై చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారు లీకులు ఇస్తూనే ఉంటారు. తద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంటారు. గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించక ముందు తమకు అనుకూలమైన మీడియా, పేపర్లలో సైతం టీడీపీ వర్గాలు రాజధాని నూజివీడు అని ఓసారి దొనకొండ అని ఓసారి లీకులు ఇస్తూ వచ్చారు. చివరికి అమరావతిలో పెట్టారు. అప్పట్లో ఈ మంత్రం కూడా సక్సెస్ అయింది. దీంతో అమరావతి విషయంలో వైసీపీ మినహా ఇతరులెవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే బాటలో వైసీపీ సర్కార్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications