వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టు హాజరవుతున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం పిఠాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం కోర్టు వాయిదా ముగించుకుని అదే రోజు రాత్రి పిఠాపురం వెళ్లారు.

శనివారం పిఠాపురం మండలంలోని చెందుర్తి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటివరకు జగన్ 228 రోజులు పాదయాత్ర చేశారు. అయితే శనివారం సాయంత్రం పాదయాత్రలో ఉండగా కొంత అస్వస్థతకు గురయ్యారు.
జగన్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. అయితే ఆదివారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారా లేక విశ్రాంతి తీసుకుంటారనే అనేది సందిగ్ధంగా మారింది. పాదయాత్ర కొనసాగింపుపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications