సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. సెలవులో జడ్జి.. విచారణ వాయిదా!

అమరావతి: ప్రజాసంకల్ప యాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే జడ్జి సెలవులో ఉన్నందున కేసు విచారణ వాయిదా పడింది.

ఒకవైపు పాదయాత్ర చేస్తున్నప్పటికీ మరోవైపు అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరవుతున్న విషయం తెలిసిందే.

YS Jagan takes break from Padayatra, attends CBI Court, Judge on Leave, Case Postponed to 22nd Dec

ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే, సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి ( 22వ తేదీ) వాయిదా వేశారు. దీంతో, జగన్ వెంటనే బయలుదేరి వెళ్లిపోయారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోర్టు కేసు విచారణ వాయిదా పడటంతో జగన్ మళ్లీ వెంటనే పాదయాత్ర కోసం అనంతపురం జిల్లా ఉప్పనాసనపల్లికి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+