అప్పుడే ఆలోచిస్తా: నేతలకు జగన్ క్లాస్, టిలోను మనం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు, నేతలకు క్లాస్ తీసుకున్నారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో జగన్ నాయకులకు పార్టీ బలోపేతంపై ఉద్భోద చేశారు. పార్టీని గడపగడపకు తీసుకు వెళ్లాలని సూచించారు.
పని చేస్తేనే పదవులు, టిక్కెట్లు ఇచ్చే విషయం ఆలోచించాల్సి ఉంటుందని నాయకులను హెచ్చరించారు. ఈ వంద రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. ఎన్నికలకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. జగన్ జైలు నుండి బయటకు వచ్చాక తొలిసారి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దానిపై చర్చించారు. అందుకు అనుగుణంగా దిశానిర్దేశనం చేశారు. ఓటర్ల నమోదు కీలకం అయినందున దానిపై దృష్టి సారించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. వైయస్ ప్రారంభించిన పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు.
తెలంగాణలోను సీట్లు
తెలంగాణ ప్రాంతంలోను మన పార్టీ సీట్లు గెలుచుకుంటుందని జగన్ నాయకులతో చెప్పారు. రానున్న కాలంలో సమైక్య ఉద్యమాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర విభజనతో జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు.












Click it and Unblock the Notifications