ఆ పరిస్థితి లేదని బాధపడ్డ జగన్
కర్నూలు: ఏపీకి ప్రత్యక హోదా కోసం కావాలనే డిమాండ్ తో వైసీపీ నేత జగన్ కర్నూలు పట్టణంలో యువభేరీ సభ నిర్వహించారు. మంగళవారం స్థానిక కాలేజీ మైదానంలో నిర్వహించిన యువభేరి బహిరంగ సభలో వైసీపీ నేత జగన్ ప్రత్యేక హోదాపై కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని అడిగిన వారు ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరంలేదనటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఎన్నాళ్లు బతికామనేది కాదని, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. మోసం చేసినా కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి లేకపోవడం బాధకరమని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications