టీడీపీ నేతలకు జగన్ బ్రేక్-ఆ కేసులపై తగ్గిన దూకుడు- తన కేసులతోనే బిజీ

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే టీడీపీ నేతలపై కేసుల పర్వం మొదలైపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీని ఎలా టార్గెట్ చేశారో అంతకు రెట్టింపు స్ధాయిలో జగన్ విపక్షాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు. అమరావతి కేసులతో మొదలుపెడితే ఈఎస్ఐ స్కాం, హత్యలు, అవినీతి, అక్రమాల పేరుతో టీడీపీ మాజీ మంత్రుల్ని ఒక్కొక్కరిగా జైలుకు పంపడం మొదలుపెట్టేశారు. వీరిలో చాలా మందిపై అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. అయితే తాజాగా సీఎం జగన్ వివిధ కారణాలతో ఈ కేసులకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

వైసీపీ టార్గెట్ టీడీపీ

వైసీపీ టార్గెట్ టీడీపీ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా అధికారం చెలాయించిన వారిపై వైసీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే కేసుల పర్వం మొదలైపోయింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు కేబినెట్ లో అర డజను మంత్రుల వరకూ జైళ్లకు వెళ్లారు. వీరిని విడిపించుకునే సరికి టీడీపీ తలప్రాణం తోకకొచ్చింది. వీరిలో పలువురిపై క్రిమినల్ కేసులు, అట్రాసిటీ కేసులు, అవినీతి అక్రమాల కేసులు మోపి జైళ్లకు పంపారు. ఈ కేసుల్లో విచారణ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం తాజాగా దూకుడు మాత్రం తగ్గించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే ఈ కేసుల్లో విచారణను ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

దూకుడుకు బ్రేక్

దూకుడుకు బ్రేక్


గత ఏడాది కాలంలో టీడీపీ నేతలపై వైసీపీ సర్కార్ వరుసగా కేసులు మోపింది. ఎన్నికల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపుతారని భావించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. దీంతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు ముందు, తర్వాత ఈ కేసుల పర్వే కొనసాగింది. ఇందులో ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, బందరులో మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అమరావతి స్కాంలో మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, తాజాగా కొండపల్లి మైనింగ్ కేసులో దేవినేని ఉమ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై నమోదైన కేసుల విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. వీటిపై ప్రభుత్వం దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.

టీడీపీ నేతలకు జగన్ బ్రేక్

టీడీపీ నేతలకు జగన్ బ్రేక్


ఆయాకేసుల్లో నిందితులుగా ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ కారణాలతో వీరిపై జరుగుతన్న విచారణలో దూకుడు తగ్గించినట్లు అర్దమవుతోంది. ఇప్పుడు ఏ ఎన్నికలూ లేకపోవడం, కార్పోరేషన్ ఎన్నికల్లో అవసరం మేరకు దూకుడు పెంచాలని భావిస్తుండటం, ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ను భయభ్రాంతుల్ని చేయడంలో ప్రభుత్వం సక్సెస్ కావడం ఇలా పలు కారణాలతో ప్రభుత్వం కేసుల విషయంలో దూకుడు తగ్గించినట్లు అర్దమవుతోంది. అయితే ఇది ఎప్పటివరకూ అన్నది స్పష్టం కావడం లేదు.

 ప్రత్యర్ధులు పూర్తయ్యారా ?

ప్రత్యర్ధులు పూర్తయ్యారా ?

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ను కొందరు మంత్రులు పదే పదే టార్గెట్ చేసేవారు. ఒక్కోసారి కారణం లేకపోయినా జగన్మోహన్ రెడ్డీ అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలకు దిగేవారు. మరికొన్ని సార్లు అధినేత చంద్రబాబు మెప్పు కోసం జగన్ పై సీబీఐ కేసుల్ని పదే పదే తెరపైకి తెచ్చేవారు. అమరావతితో పాటు ప్రతీ విషయంలోనూ జగన్ ను వీరు టార్గెట్ చేసేవారు. ఇలాంటి వారిలో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు ఉన్నారు. వీరందరినీ ప్రస్తుత వైసీపీ సర్కార్ ఏదో ఒక కేసులో ఇరికించేసింది. వీరితో అచ్చెన్నాయుడు, ఉము, కొల్లు రవీంద్ర వంటి వారిని అయితే జైళ్లకు కూడా పంపింది. దీంతో జగన్ కు రాజకీయ ప్రత్యర్ధులుగా ఇరుకునపెట్టిన వారందరి టార్గెట్ పూర్తయినట్లు కనిపిస్తోంది.

 సొంత కేసుల్లో జగన్ బిజీ ?

సొంత కేసుల్లో జగన్ బిజీ ?

టీడీపీ నేతలపై దూకుడుకు జగన్ కాస్త బ్రేక్ ప్రకటించడం వెనుక ఆయన ఎదుర్కొంటున్న కేసులు కూడా ఓ కారణమనే ప్రచారం జరుగుతోంది. ఓవైపు సీబీఐ కేసులు, మరోవైపు ఈడీ కేసులు, ఇంకోవైపు బెయిల్ రద్దు కోసం రఘురామరాజు దాఖలు చేస్తున్న పిటిషన్లు... ఇలా జగన్ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు సమయం దొరకడం లేదని అర్ధమవుతోంది. దీంతో జగన్ వీరిపై కేసుల్లో దూకుడు పెంచేందుకు కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓసారి తనపై కేసుల హంగామా తగ్గితే అప్పుడు మరోసారి వీరిని టార్గెట్ చేయవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+