ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు-కేసీఆర్‌ల దూకుడు

Posted By:
Subscribe to Oneindia Telugu
  2018 అక్టోబర్‌లోనే ఎన్నికలు : పవన్, జగన్, బాబు, కెసిఆర్ హడావుడి | Oneindia Telugu

  అమరావతి: వచ్చే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు రానున్నాయా? అంటే రాజకీయ నేతల హడావుడి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. బుధవారం వైసిపి నేత తొలిసారి 2018 అక్టోబర్‌లో ఎన్నికలు రావొచ్చని చెప్పారు.

  'ఆస్తులను అప్పగించండి, జగన్‌కు రివర్స్, వైసిపి మైండ్ బ్లాంక్'

  గత కొద్ది కాలంగా టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. టిడిపి, బిజెపిలు చాలా రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సూచనలిస్తున్నాయి.

   జగన్ కీలక వ్యాఖ్యలు

  జగన్ కీలక వ్యాఖ్యలు

  బుధవారం పార్టీ నేతలతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అక్టోబర్ నెలలో ఎన్నికలు రావొచ్చునని ముహూర్తం కూడా చెప్పేశారు. పార్టీ శ్రేణులు ఏమరుపాటున ఉండవద్దని, సిద్ధం కావాలని హితవు పలికారు.

   ముందస్తుపై చంద్రబాబే చెప్పారు

  ముందస్తుపై చంద్రబాబే చెప్పారు

  అక్టోబర్ నెలలోనే ఎన్నికలు వస్తాయని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే చెబుతున్నారని, కాబట్టి ముందస్తుకు సిద్ధంగా ఉండాలని జగన్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఇక నుంచి ప్రతిక్షణం ఎంతో విలువైనది అని పిలుపునిచ్చారు. ఎన్నికలు అక్టోబర్ నెలలో వస్తే మంచిదని, ఒకవేళ ఆలస్యమైనా ఇబ్బంది లేదని, ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.

  నంద్యాల తర్వాత చంద్రబాబు దూకుడు

  నంద్యాల తర్వాత చంద్రబాబు దూకుడు

  మరోవైపు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందస్తు మూడ్‌లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. నేతలు ఇటీవల అన్ని వర్గాలపై, ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల అనంతరం చంద్రబాబు, టిడిపి దూకుడు పెంచింది. చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. చంద్రబాబు దృష్టి ప్రధానంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పైన ఉంది. వీటిని సాధ్యమైనంత పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తున్నారు.

   కేసీఆర్ నజర్

  కేసీఆర్ నజర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. ఇటీవల పార్టీ సమన్వయ కమిటీలో మాట్లాడుతూ.. మనం 80 సీట్లు గెలుస్తామని, మరింత కష్టపడితే మరో ముప్పై సీట్లు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత పార్టీలో మార్పులు, చేర్పులు చేశారు.

   రంగంలోకి పవన్ కళ్యాణ్, జగన్ చెప్పేశారు

  రంగంలోకి పవన్ కళ్యాణ్, జగన్ చెప్పేశారు

  ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దూకుతున్నారు. ఆయన కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని గతంలోనే ప్రకటించారు. చాలా రోజులుగా ముందస్తు మాట అందరి నేతల నోటి నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా వైసిపి అధినేత జగన్ నెలను కూడా చెప్పేశారు. వచ్చే అక్టోబర్ లోనే ఎన్నికలు రావొచ్చునని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday talk about early elections in party meeting. He said that Early elections may come in next year October.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి