జగన్ పార్టీ ప్రక్షాళన - ఆ నేతలకు షాక్, కీలక నియామకాలు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటనకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో ఊహించని ఓటమితో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత సీనియర్ల నుంచి జగన్ వ్యక్తిగతం గా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మార్పులో భాగంగా పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటున్నారు. ఇక..కొందరు ముఖ్య నేతల తీరు నష్టం చేసిందని గుర్తించిన జగన్ వారి హోదా మార్చేందుకు సిద్దమయ్యారు. జిల్లా , నియోజకవర్గాలకు కొత్త బాధ్యతుల నియామకం పై కసరత్తు చేస్తున్నారు.
వైసీపీ ప్రక్షాళన
వైసీపీలో సమూల మార్పుల కు జగన్ సిద్దమయ్యారు. పెద్ద ఎత్తున నియోజకవర్గ బాధ్యులను మార్చాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు 80 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులతో పోటీ చేయించారు. సిట్టింగులపై వ్యతిరేకత ఉందని కారణం చూపుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. కొన్నిచోట్ల కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని చోట్ల చేర్పులు మార్పులు చేశారు. అయినా సరే ప్రజలు సమ్మతించలేదు. దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో తీవ్ర అంతర్మధనంలో పడ్డారు జగన్.

కేడర్ కు అందుబాటులో
పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సమన్వయకర్తలను మార్చి పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. అటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీని నిర్మించాలని.. పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల బాధ్యులను మార్చుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా దేవ భక్తుని చక్రవర్తిని నియమించారు.
కీలక నియామకాలు
ఇక సజ్జల వంటి వారిని పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయాలని..పార్టీ నేతలతో తానే నేరుగా ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ బలహీనతలు ఎన్నికల సమయంలో గుర్తించిన జగన్ జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం ప్రారంభించారు. దాదాపు 12 జిల్లాల్లో కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్దిగా పార్టీ నేతలతో చర్చించిన తరువాత బొత్సా పేరును జగన్ ఖరారు చేసారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల నియామకంలోనూ ఇదే విధంగా సమావేశాలు నిర్వహించి..నియామకాలు పూర్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications