జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం - అక్కడే గురి..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. జగన్ ఓటమే లక్ష్యంగా ఏపీలో రెండు కూటమిలు సిద్దమయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వామపక్షాలతో జత కట్టిన కాంగ్రెస్ రెండో కూటమిగా పోటీ చేస్తోంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. అభ్యర్దుల ప్రకటన పూర్తి చేసి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్న జగన్.. ప్రత్యర్ది కోటల పైన గురి పెట్టారు.

జగన్ ప్రచారం : సీఎం జగన్ ఈ నెల 19వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు 77 అసెంబ్లీ 23 పార్లమెంట్ ఇంచార్జి లను మార్చిన సీఎం జగన్...ఈ రోజు ఇడుపుల పాయ కేంద్రంగా తన పార్టీ నుంచి పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా అధికారికంగా ప్రకటిస్తున్నారు. కొద్ది పాటి మార్పులు మినహా దాదాపుగా ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్దులే తుది జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్దులను ధర్మాన, ఎంపీ అభ్యర్దులను ఎంపీ నందిగం సురేష్ ప్రకటిస్తారు. నాలుగు సిద్దం సభల ద్వారా కేడర్ కు ఎన్నికలకు సిద్దం చేసే ప్రయత్నం చేసారు. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్దం అయ్యారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్దం చేసారు.

YS Jagan to begin his Election campaign on 19th from Ichapuram Route map fixed

ప్రత్యర్ది కోటలపై గురి : ఈ నెల 18 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రతీ రోజు రెండు లేదా మూడు బహిరంగసభలు లేదా రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో పూర్తిగా ప్రత్యర్ది పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నారు. అక్కడ ప్రచారంతో పాటుగా పార్టీ పరిస్థితుల పైన జగన్ సమీక్ష్ చేయనున్నారు. అవసరమైన దిశా నిర్దేశం పార్టీ నేతలకు చేసేలా జగన్ తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఇదే సమయంలో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల పైన జగన్ కసరత్తు పూర్తి చేసారు.

YS Jagan to begin his Election campaign on 19th from Ichapuram Route map fixed

జగన్ సింగిల్ పోరాటం : 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచే సీఎం జగన్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అభ్యర్దుల ప్రకటన విషయంలోనూ 2019 తరహాలోనే అమలు చేసిన విధానమే కొనసాగిస్తున్నారు. ఈ సారి వైసీపీ నుంచి జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారు. షర్మిల తన అన్నతో విభేదించి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. విజయమ్మ వైసీపీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపించటం లేదు. విజయ సాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. దీంతో, ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్.. ఎన్నికల ప్రచారంలోనూ అన్నీ తానే అయి వ్యవహరించాల్సి ఉంది. దీంతో, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్..తన సత్తా చాటుకొనేందుకు సిద్దమవుతున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీలో ఎన్నికలు...ఫలితాల పైన సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+