జగన్ నిరసన- దీక్ష, అక్కడ నుంచే మొదలు ..ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రయివేటు వారికి ఇవ్వటం సరి కాదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనల్లో స్వయంగా తానే పాల్గొనాలని నిర్ణయించారు. ఇందు కోసం వేదిక.. ముహూర్తం ఫిక్స్ అయ్యాయి. దీంతో, రాష్ట్రం లో ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పై కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. తాము ఈ నిర్ణయం పైన నిరసనలు కొనసాగిస్తామని.. అయినా, ప్రభుత్వం ముందుకే వెళ్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల కోసం పోరాబాట నిర్వహించారు. ఇక..ఇప్పుడు ఈ నిరసనల్లో తాను స్వయంగా పాల్గొనాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి.. అక్కడ జరిగిన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
మాజీ సీఎం జగన్ తన హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఇప్పటికే వివరించారు. పార్టీ నేతలు సైతం అదే విధంగా ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని కోరుతున్నారు. పది కాలేజీలను ప్రయివేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసారని విమర్శిస్తున్నారు. జగన్ స్వయంగా మెడికల్ కాలేజీ సందర్శించి.. తమ ప్రభుత్వం లో చేపట్టిన నిర్మాణాలు.. వాటి లక్ష్యాలను వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
నర్సీపట్నం కాలేజీ సందర్శన తరువాత అక్కడి నుంచే జగన్ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ధర్నాకు జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి లేదా నంద్యాల కేంద్రంగా ఈ ధర్నా ఉంటుందని సమాచారం. దీంతో, 9న జగన్ నర్సీపట్నం పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications