బ్రిటన్ టూర్ కు జగన్! సీబీఐ కోర్టు అనుమతిపై ఉత్కంఠ?

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బ్రిటన్ టూర్ కు వెళ్లబోతున్నారు. లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు సిద్దమైన ఆయన సీబీఐ కోర్టును ఈ మేరకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ అభిప్రాయాన్ని కోరింది. ఇవాళ సీబీఐ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనుంది.

లండన్ లో చదుపుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టును బెయిల్ షరతులు తాత్కాలికంగా సడలించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీఎంగా ఉండగా పలుమార్లు సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లి వచ్చిన జగన్.. మరోసారి విపక్షంలో ఉంటూ ఇదే తరహా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చిన సందర్భంగా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని జగన్ కు సీబీఐ కోర్టు షరతులు విధించింది. దీంతో జగన్ ప్రతీసారి తప్పనిసరిగా సీబీఐ కోర్టు తీసుకోవాల్సిన పరిస్ధితి.

ys jagan urges cbi court permission for Britain tour in next month

మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఇచ్చిన దౌత్య పాస్ పోర్టును జగన్ నిన్న తిరిగి ఇచ్చేశారు. దీని స్ధానంలో సాధారణ పాస్ పోర్టును తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్ గన్నవరం ఎయిర్ పోర్టులో ఇలా పాస్ పోర్టు మార్చుకున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు, పలువురు ప్రముఖులకు మాత్రమే దౌత్య పాస్ పోర్టు కలిగి ఉండే అవకాశం ఉంది. వారు పదవీచ్యుతులు అయిన తర్వాత మాత్రం వీటిని ఇచ్చేసి సాధారణ పౌరుల్లాగే మామూలు పాస్ పోర్టు తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+