సింగపూర్‌కు ఉత్తరాలు రాస్తున్నారు, ఎక్కడికెళ్లొద్దు: లోకేష్ వర్సెస్ జగన్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకు పడుతున్నారు. ఇటీవల టిడిపి సమావేశాల్లో ఆయన జగన్‌కు చురకలు అంటించారు.
ప్రత్యేక హోదా పైన వైసిపి తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, తాజాగా మంగళవారం నాడు జగన్ కర్నూులులోని యువభేరీలో పరోక్షంగా నారా లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల జగన్ పైన లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. వైసిపి వంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందన్నారు. ఒకవైపు ఉద్యోగాలు రావడంలేదని అంటున్నారని, మరోవైపు అమరావతి పనులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని, సింగపూర్‌కు ఉత్తరాలు రాసి ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి కర్నూలు జిల్లాలో జగన్ కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అనే చిత్తశుద్ధి వారికి ఉంటే ఈ రోజు కేంద్రంతో పోరాటం చేసేవారని, ఇటువంటి ఇన్సెంటీవ్స్ కేవలం ప్రత్యేక హోదాతోనే వస్తాయన్నారు. చంద్రబాబు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని, వాళ్లే ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చేదన్నారు.












Click it and Unblock the Notifications