రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును జైల్లో పెట్టాలి: జగన్, పరామర్శ: బాబు పాపాలు పోవన్న చెవిరెడ్డి

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: రాజమండ్రిలో గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి బంధువులను, గాయపడిన బాధితులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధితులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన, బాధితులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

చంద్రబాబుపై జగన్ ఊగిపోయారు. బాబులో మానవత్వం అనేది ఉంటే వెంటనే రాజీనామా చేసి కాశీకి పోయి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఘాట్ వద్ద ఉండిపోవడంతో ప్రజలు ఎవరూ నీళ్లలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు.

చంద్రబాబు తన పూజలు అయిపోయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బయలుదేరిన తర్వాత అప్పుడు గేట్లు తెరిచారన్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ వచ్చారని చెప్పారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని, చంద్రబాబును జైల్లో పెట్టాలన్నారు.

భక్తులు ఎంతమంది వస్తారో తెలియనప్పుడు వాళ్ల భద్రత, రక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు మరింత అప్రమత్తంగా ఉండి ఉండాల్సిందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 30 మంది మరణించిన ఘటనపై అంతకుముందు జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన విషాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల కోసం నా హృదయం తపిస్తోంది. మానవత్వం లేని, అసమర్థ ప్రభుత్వం కారణంగానే భక్తులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు' అని ఆయన ట్వీట్ చేశారు.

ఏ పుష్కారాల్లో మునిగినా పాపాలు పోవు: చంద్రబాబుపై చెవిరెడ్డి ఫైర్

విశాఖపట్నం: ఏపి సిఎం చంద్రబాబునాయుడు చేసిన పాపాలు ఏ పుష్కరాల్లో మునిగినా పోవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శాపాలు రాష్ట్రానికి పాపాలుగా మారుతున్నాయని ఆరోపించారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

YS jagan visits Rajahmundry Pushkar Ghat

భూమి మీదకి దిగి పరిపాలన చేయాలని.... ఆకాశం మీద నుంచి చేస్తే ఎలా? అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి యనమల, దేవాదాయ శాఖ మంత్రి ఎవరు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. పరిపాలన దక్షుడికి హుందాతనంతోపాటు అనుభవం కూడా ఉండాలని చెవిరెడ్డి అభిప్రాయపడ్డారు.

వయస్సు పెరిగితే అనుభవం రాదన్నారు. చంద్రబాబు ఏ పుష్కరంలో మునిగినా చేసిన పాపాలు పోవని విమర్శించారు. రూ. పుష్కరాల కోసం కేటాంచిన రూ. 1600 కోట్లలో రూ. 1000 కోట్లు దోచుకోవడమే సరిపోయిందన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబు పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యత పుష్కర పనుల నాణ్యతా పనులకు ఇవ్వలేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.

English summary
YSR Congress Party president YS jaganmohan Reddy on Tuesday visited Rajahmundry Pushkar Ghat after stampede.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X