సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్
తాను రెండేళ్లలో ముఖ్యమంత్రిని అవుతానని, మీ తాట తీస్తానని, మీ పేర్లన్నీ గుర్తు పెట్టుకుంటానని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
విశాఖ: తాను రెండేళ్లలో ముఖ్యమంత్రిని అవుతానని, మీ తాట తీస్తానని, మీ పేర్లన్నీ గుర్తు పెట్టుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు విశాఖ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. విమానాశ్రయంలో హైడ్రామా చోటు చేసుకుంది.
ఆర్కే బీచ్ వద్ద క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నిర్బంధంలోకి తీసుకున్నారు.
తాను ఓ ప్రయాణీకుడిగా వచ్చానని, అలాంటప్పుడు తనను ఆపడం ఏమిటని అడిగారు. ఓ ముఖ్యమంత్రిని మీరు పట్టుకున్నారు.. ముఖ్యమంత్రినే అరెస్ట్ చేస్తారా అంటూ జగన్ అనడం గమనార్హం. ఆ తర్వాతే రెండేళ్లలో సీఎంను అవుతానని చెప్పారు.

పోలీసులతో వాగ్వాదం
తనను పోలీసులు నిర్బంధించడంపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు నన్ను అరెస్టు చేయడం ఏమిటని ఆగ్రహించారు. అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతోందా అన్నారు.
మమ్మల్ని ఇక్కడ నిర్బంధించి ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఏం చేయాలని తనను ఇక్కడ ఆపారని ప్రశ్నించారు. రెండే రెండేళ్లలో నేను సీఎంను అవడం ఖాయమని, ఎవర్నీ మర్చిపోనని అన్నారు.
పిల్లలకు ఉద్యోగాలు కావాలని మేం పోరాడుతుంటే, ఉద్యోగాలు వద్దనే వారికి మీరు సపోర్ట్ చేస్తారా అని నిలదీశారు. ఎలా ప్రవర్తించారో తెలియని వాళ్లు పోలీసు డిపార్టుమెంటులో ఎలా ఉంటారని అడిగారు.
దేశీయ ఆగమన బోర్డు చూపించి.. దానిని పీకేయమని ఆగ్రహించారు. తాను రెండేళ్లలో సీఎంను అవుతానని, అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటానని, మీ తాట తీస్తానని హెచ్చరించారు. అసలు ఐడీ కార్డు లేదు, ఏం లేదు మీరు ఏమి పోలీసులు అని నిలదీశారు.
గంటన్నరపాటు నిర్బంధించారు: వైవీ సుబ్బారెడ్డి
తమను గంటన్నర పాటు విమానాశ్రయంలో నిర్బంధించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రన్ వే పైకి సివిల్ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీని అడిగినా తమను నిర్బంధించింది ఎవరో చెప్పడం లేదన్నారు. సివిల్ డ్రెస్సులో వచ్చింది పోలీసులేనా అని అడిగారు.
-
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
ఇట్స్ అఫీషియల్: ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications