ఫీల్డ్‌లో టేబుల్‌లా వంగిన గార్డ్: జగన్‌టూర్‌పై కాంట్రోవర్సీ
హైదరాబాద్/ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పర్యటనకు వెళ్లినప్పుడు అంగరక్షకుడిని టేబుల్‌లా వినియోగించుకున్నారని, దీనిపై విమర్శలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
నెల రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు తుఫానులు అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. జగన్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నవంబర్ నెలాఖరులో రెండు రోజుల పాటు హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటిస్తున్నప్పుడు ఓ పొలంలోకి వెళ్లి అంగరక్షకుడిని ఆసరాగా పెట్టుకొని మైకులో మాట్లాడారు. వరి పొలంలోకి వెళ్లిన జగన్ రైతులను ఉద్దేశించి మైకులో మాట్లాడారు.
జగన్ మాట్లాడుతున్నంత సేపు అతను ఆసరాగా ఉన్నారు. దీంతో అంగరక్షకుడి పైన మైకు పెట్టి మాట్లాడటమేమిటని జగన్ పైన విమర్శలు వినిపిస్తున్నాయని, ఇది జిల్లాలోను చర్చనీయాంశమైందంటున్నారు.












Click it and Unblock the Notifications