'అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్, టిడిపి నేతల గుండెల్లో గుబులు'
మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయసాధనే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జగన్ సీఎం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అభిప్రాయపడ్డారు. తన స్వగృహంలో వైసిపి ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షలో ఆయన పాల్గొన్నారు.

మావైపే ఉన్నారు
ఈ సందర్భంగా మాట్లాడారు. అధికార పక్షం ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు తమవైపే ఉన్నారని మేకపాటి గౌతమ్ అన్నారు. టిడిపి మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతోందని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. శనివారం 24వ తేదీన ఆత్మకూరులో జరిగే పార్టీ ప్లీనరీకి కార్యకర్తలందరూ రావాలని పిలుపునిచ్చారు.

పర్యటనలు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టనున్నట్టు మేకపాటి గౌతమ్ తెలిపారు. పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై అధికారులతో చర్చిస్తామన్నారు. టిడిపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయన్నారు.

టిడిపి నేతల గుండెల్లో గుబులు
రాష్ట్రంలో ఇటీవల జరిగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో గుబులు రేకెత్తుతోందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు. పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో కలిసి పలు వీధుల్లో పర్యటిస్తామన్నారు.

నత్త నడకన పనులు
నెలలు తర బడి డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండటంతో పారిశుధ్యం అధ్వానంగా తయారయిందని మేకపాటి అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణాధ్యక్షులు, మున్సిపల్ ఫోర్‌లీడర్ అల్లారెడ్డి ఆనంద రెడ్డి, పట్టణ యువత అధ్యక్షుడు నాగుపాటి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications