గుంటూరులో రెండ్రోజుల దీక్షకు సిద్ధమైన జగన్

Subscribe to Oneindia Telugu

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. రైతు సమస్యలపై మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. గుంటూరు వేదికగా ఏప్రిల్ 26, 27 తేదీలలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. జగన్ రెండ్రోజులపాటు ఈ దీక్ష చేపట్టనున్నారు.

అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓ వైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం, అయినా ఈ అంశంపై ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడంతో జగన్ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ys jagan will do two days deeksha in Guntur for farmers

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనమవుతున్నాయని, దుగ్గిరాల పసుపు మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఉందని వారు చెప్పారు. ధరలు భారీగా పడిపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that YSR Congress Party president YS Jaganmohan Reddy will do two days deeksha in Guntur on farmers issues.
Please Wait while comments are loading...