జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పథకాల కింద అందించే ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి, గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు నెలల మధ్య పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ సాయాన్ని పెళ్లికూతురు బ్యాంకు ఖాతాలో జమచేయగా, ఈసారి వారి తల్లుల ఖాతాల్లో జమచేయబోతున్నారు.

ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి, అన్నదమ్ములు, గార్డియన్‌గా వ్యవహరించేవారి ఖాతాల్లో జమచేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. కులాంతర వివాహం చేసుకున్నవారికి మాత్రం పెళ్లికూతురు ఖాతాలో జమచేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేల చొప్పున ఇస్తారు.

jagan

కులాంతర వివాహానికి రూ.75 వేలు, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల సాయమందిస్తారు. అర్హులంతా వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. వధువుకు 18 సంవత్సరాలు, వరుడుకి 21 సంవత్సరాల వయసు నిండివుండాలి. ఇద్దరూ పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి. మొదటి వివాహానికి మాత్రమే ప్రభుత్వం సాయం చేస్తుంది.

అయితే భర్త చనిపోతే వితంతువుకు సాయమందించేలా మినహాయింపు ఇచ్చారు. ఇద్దరు పదో తరగతి పాస్ అవ్వాల్సిందే. చదువును ప్రోత్సహించడంతో పాటూ బాల్య వివాహాలను అరికట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లికి మాత్రమే ఈ సాయం అందుతుంది. అయితే భర్త చనిపోతే.. వితంతువుకు మాత్రం సాయం అందించేలా మినహాయింపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+