త్వరలోనే ప్రజలకు వైఎస్ జగన్ అదరగొట్టే ఐడియా!
ఏపీలో కూడా త్వరలోనే క్యారవాన్ టూరిజం సంస్కృతి అమలవబోతోంది.
దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకానికి మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వినోద, విహార యాత్రలకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఏపీలో దీన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లడం.. బస గురించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్నిరకాల సౌకర్యాలతో కూడిన వసతిని అందించి ప్రజలకు మంచి అనుభూతిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం తన ప్రణాళికలను ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.

ఏపీటీడీసీ కసరత్తులు
విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి కొన్నేళ్లుగా మనదేశంలోను విస్తరిస్తూ వస్తోంది. హిమాచలప్రదేశ్, గోవా, ఢిల్లీ, బెంగళూరు తదితరచోట్ల మొబైల్ హౌస్ పర్యాటకం ఉంది. కేరళ రాష్ట్రం ఇటీవలే మొబైల్ పర్యాటకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ తర్వాత దెబ్బతిన్న పర్యాటక రంగానికి క్యారవాన్ సంస్కృతి కొత్త ఊపును అందిస్తోందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇప్పుడు క్యారవాన్ టూరిజంపై ఆసక్తి చూపిస్తున్నాయి.

అన్ని సౌకర్యాలుంటాయి
ఈ క్యారవాన్ లో ఏసీ, టాయిలెట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, షవర్, ఒక ఫ్రిడ్జ్, కిచెన్, మ్యూజిక్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. మనకు నచ్చిన ఆహారం వండుకోవడానికి అవసరమైన అన్నింటినీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉండే సోఫాలను మంచాలుగా మార్చుకోవచ్చు. బయట గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు వీటిద్వారా అవకాశం కల్పిస్తున్నాయి.

వాహనం సైజును బట్టి..
ఒక్కో వాహనం సైజును బట్టి నాలుగు నుంచి తొమ్మిది మంది వరకు ఇందులో ప్రయాణించడానికి వీలుంటుంది. డ్రైవర్‌తో సహా అందుబాటులో ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులోకి వచ్చాయి. కావాలంటే వీటిని తీసుకోవచ్చు. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి, సెల్ఫె డ్రైవింగా? లేదంటే డ్రైవర్ తోనా? తదితరాలనుబట్టి చార్జీలుంటాయి. త్వరలోనే ప్రజలకు క్యారవాన్ అనుభూతిని పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications