వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబులా నా వద్ద డబ్బు లేదు, అంత దిగజారను: దోపిడీ లెక్క చెప్పిన జగన్!

ముఖ్యమంత్రి చంద్రబాబులా తన వద్ద డబ్బులు లేవని, సీఎం పదవి లేదని, పోలీసు బలగం లేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. ఆయన నంద్యాలలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబులా తన వద్ద డబ్బులు లేవని, సీఎం పదవి లేదని, పోలీసు బలగం లేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. ఆయన నంద్యాలలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

జగన్‌ను ఓసారి అమెరికా పంపిస్తే: బాబు భావోద్వేగం, 2003లో దాడిపై వైయస్ మీద సంచలనంజగన్‌ను ఓసారి అమెరికా పంపిస్తే: బాబు భావోద్వేగం, 2003లో దాడిపై వైయస్ మీద సంచలనం

శిల్పాను గెలిపించండి

శిల్పాను గెలిపించండి

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానమే తనకు ఉన్న ఆస్తి అని జగన్‌ అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే యుద్ధమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపు నిలబడి తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలన్నారు.

నాకు దేవుడి దయ

నాకు దేవుడి దయ

2019 మహా సంగ్రామానికి నంద్యాలనే నాంది కావాలని జగన్ పిలుపునిచ్చారు. శిల్పా మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలకాలన్నారు. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలే తనకు తెలుసునని చెప్పారు. దేవుడి దయ, ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.

అంతగా దిగజారను

అంతగా దిగజారను

అధికారం కోసం దిగజారే మనస్తత్వం తనది కాదని జగన్ చెప్పారు. మీ జగన్ అబద్దం ఆడడని, మోసం చేయడని, మాట మీద నిలబడే వ్యక్తి అన్నారు. మూడన్నరేళ్లుగా దోచుకుంటున్న చంద్రబాబు.. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో పంచే కార్యక్రమం చేపట్టారన్నారు.

బాబు ఇలా దోచుకున్నారు..

బాబు ఇలా దోచుకున్నారు..

ఆరున్నర కోట్ల ప్రజలకు చెందిన మూడున్నర లక్షల కోట్లను చంద్రబాబు దోచుకున్నారని, అంటే ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు దోపిడీ చేశారని జగన్ చెప్పారు. అందులో నుంచి రూ.5వేలు పంచుతారట అని ఎద్దేవా చేశారు. పాపానికి ఓటు వేయమని ఏ దేవుడూ చెప్పడని, దెయ్యాలు మాత్రమే అలా చెబుతాయన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's road show in Nandyal constituency on Wednesday evening. He lashed out at AP CM Chandrababu Naidu in road show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X