జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు.. ! ఈసారి స్పెషల్ ఏంటంటే?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లే జగన్, 6వ తేదీన కూడా అక్కడే ఉండబోతున్నారు. ముందుగా ప్రధాని మోడీని కలిసి చర్చలు జరపనున్న జగన్.. అనంతరం కేంద్రమంత్రుల్ని కలవబోతున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ టూర్ లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీ కీలక బిల్లులపైనా జగన్ తో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ ఎల్లుండి అంటే జూలై 5 ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీని సీఎం జగన్ కలవబోతున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జగన్ మరోసారి ప్రధానికి వినతి పత్రం ఇవ్వబోతున్నారు. ఇందులోనే విభజన హామీల అమలుకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి.

అలాగే ప్రధాని మోడీ సీఎం జగన్ కు త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై మద్దతు కోరనున్నారు. ఇందులో ఢిల్లీలో పాలనకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై పెట్టే బిల్లు, అలాగే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన బిల్లు, ఇతర బిల్లులు కూడా ఉన్నాయి. వీటిపై కేంద్రానికి పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ సాయం తప్పనిసరి కాబోతోంది. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరే అవకాశముంది.
మరోవైపు ప్రధాని మోడీతో జూలై 5 సాయంత్రం జరిగే భేటీ అనంతరం రాత్రికి కానీ, లేకపోతే జూలై 6న ఉదయం కానీ హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలోనూ విభజన హామీల అమలుతో పాటు మూడు రాజధానులకు సంబంధించిన అంశాలపైన జగన్ వినతి పత్రాలు ఇస్తారు. అలాగే రాష్ట్రానికి పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులపై అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులతో జగన్ చర్చించే అవకాశముంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications