విశాఖ కేంద్రంగా జగన్, ప్రభుత్వానికి కీలక డిమాండ్..!!

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. స్టీల్ ప్లాంట్ లో జరిగిన తాజా ఘటనలో 8 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1,500 డిగ్రీల వేడితో స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. కేంద్రం ఇప్పటికే పరిహారం ప్రకటించింది. కాగా.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చటంతో పాటుగా బాధితుల పరామర్శ కోసం విశాఖ వస్తున్న జగన్.. ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ చేయనున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పరిశీలించారు. కేంద్రం పరిహారం ప్రకటించింది. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బాధితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించింది. కాగా, మాజీ సీఎం జగన్ ప్రమాద బాధితులను పరిమర్శించేందుకు రేపు (బుధవారం) విశాఖకు వెళ్తున్నారు. అక్కడ ప్లాంట్ తో ప్రమాదం జరిగిన తీరు పైన అడిగి తెలుసుకోనున్నారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల తో పాటుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఇదే సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం పైన కొత్త డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచేందుకు సిద్దమయ్యారు.

టీడీపీకి మరో కీలక పదవి: ప్రధాని మోదీ- చంద్రబాబు భేటీలో కీలక నిర్ణయాలు..!!
టీడీపీకి మరో కీలక పదవి: ప్రధాని మోదీ- చంద్రబాబు భేటీలో కీలక నిర్ణయాలు..!!
ys-jagan-decided-to-console-steel-plant-accidents-victims-in-his-visakha-tour-key-demand-before-gov

బాధితులకు పరామర్శ.. ప్రభుత్వానికి డిమాండ్

అందులో భాగంగా ప్రమాదంలో మరణించిన వారికి కేంద్రం రూ 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఆ పరిహారం కోటి రూపాయాలు ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం పైన వైసీపీ నేతలు స్పందించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలవాలని ఎంపీ తనూజ కోరారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+