అన్నతో పోరాటంపై కాంగ్రెస్ కు తేల్చేసిన షర్మిల - వాట్ నెక్స్ట్..!!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని..తన పార్టీ విలీనం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నుంచి ఏపీలో షర్మిల కీలక పాత్ర పోషిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ జన్మదినం నాడు షర్మిల చేసిన ట్వీట్ తో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కు షర్మిల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
కాంగ్రెస్ తో షర్మిల
షర్మిల కాంగ్రెస్ తో కలవటానికి సిద్దం. పొత్తుకు ఓకే..పార్టీ విలీనం పై తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని ఆలోచన. కానీ, ఆ పార్టీ ముఖ్య నేతలే అడ్డుపడుతున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణలో కాదు ఏపీలో షర్మిల సేవలు వినియోగంచుకోవాలని హైకమాండ్ ముందు వాదిస్తున్నారు.

షర్మిల తాను తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసాను..తెలంగాణలోనే కొనసాగుతానంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో చర్చలు చేసారు. తెలంగాణలో తాను కాంగ్రెస్ తో పని చేయటానికి సిద్దమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.
ఏపీలో షర్మిలకు బాధ్యతలు
తాజాగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతోనూ షర్మిల వ్యవహరం పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల సేవలను ఏపీకి పరిమితం చేయాలని పార్టీ నాయకత్వం వద్ద సూచించినట్లు సమాచారం.
గతంలో చంద్రబాబు తో పొత్తు కారణంగా కేసీఆర్ చేతికి అస్త్రం ఇచ్చిన విధంగానే.. ఇప్పుడు షర్మిలను తెలంగాణలో చేర్చుకోవటం ద్వారా అధికార బీఆర్ఎస్ కు అవకాశం గా మారుతుందని కొందరు రేంత్ రెడ్డి వర్గం వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..హైకమాండ్ సైతం పార్టీ ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకే పరిమితం అంటూ
షర్మిల మాత్రం తాను ఏపీకి వెళ్లేందుకు సిద్దంగా లేనని తేల్చి చెబుతున్నారు. తాను తెలంగాణలోనే రాజకీయం చేస్తానని.. రాజకీయాల్లో చివరి వరకు తెలంగాణలోనే ఉంటానని కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టత ఇచ్చారని సమాచారం. ముందుగా షర్మిల పార్టీలోకి రావటం ద్వారా ఏపీలోనూ ప్రచారం చేయించే అవకాశం ఉంటుందని డీకే శివకుమార్ లాంటి వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకు షర్మిల సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. జూలై 8న వైఎస్సార్ జన్మదినం నాడు షర్మిల కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రయాణం పైన ప్రకటన చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు షర్మిల తెలంగాణకే పరిమితం అవుతానని చెబుతుండటంతో ఈ మొత్తం వ్యవహారంలో డైలమా కొనసాగుతోంది. మరి షర్మిల మనసు మార్చుకుంటారా..ముందుకే వెళ్తారా అనేది చూడాలి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications