మేనత్త విమర్శల వెనుక సీక్రెట్ ఇదే..! వైఎస్ షర్మిల ఘాటు కౌంటర్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కడప రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వివేకా హత్యను కారణంగా చూపుతూ సోదరుడు అవినాష్ రెడ్డిపై ఎంపీగా పోటీకి దిగిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలపైఇవాళ వైఎస్ సోదరి విమలమ్మ విమర్శలు ఎక్కుపెట్టారు. షర్మిలతో పాటు సునీత నోరు మూసుకోవాలంటూ విమలమ్మ చేసిన సూచన చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబం పరువు తీస్తున్నారంటూ విమలమ్మ చేసిన కామెంట్స్ పై షర్మిల ఘాటుగా స్పందించారు.
విమలమ్మ తమకు మేనత్తే అని, అయితే ఆధారాలు లేకుండా తామేమీ మాట్లాడటం లేదని షర్మిల తెలిపారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని, స్వయంగా సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామన్నారు. ఆధారాలు ఉండబట్టే తమకు తెలిసిందన్నారు. అందుకే తాము మాట్లాడుతున్నామన్నారు. ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామన్నారు.

విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారని, ఆయన ఆర్థికంగా బల పడ్డారని షర్మిల ఆరోపించారు. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయిందన్నారు. విమలమ్మ కి వయసు మీద పడిందని, అందులో ఎండా కాలం, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటూ షర్మిల ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications