షర్మిల పంచ్​ల మీద పంచ్​లు

వందే మాతరం గీతం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగం పట్ల ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆ ప్రసంగంలో దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది- స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించినట్టేనని అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడు కాగా, సిసలైన విశ్వాస ఘాతకుడు మోదీనేనని వైఎస్ షర్మిల విమర్శించారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమర యోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ వ్యాఖ్యలు దెబ్బకొడుతున్నట్లేనని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా ఆయన మత విధ్వేషాలను రెచ్చగొట్టినట్లేనని ఆరోపించారు.

YS Sharmila criticizes PM Modi Over his speech on Vande Mataram

దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని రావడానికి జవహర్ లాల్ నెహ్రూ 12 సంవత్సరాల పాటు జైలు శిక్షను భరించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. నెహ్రూ మీద, ఆయన పోరాటం వల్ల సిద్ధించిన స్వతంత్ర భారత దేశంలో 12 సంవత్సరాలుగా ప్రధాని పదవిలో ఉంటూ రాజభోగం అనుభవిస్తున్న మోదీ మాట్లాడడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మోదీ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించడంతో సమానంగా అభివర్ణించారు షర్మిల.

బ్రిటీష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పూర్వీకులు ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మత ఛాందసవాదులు ఏనాడైనా వందేమాతర గీతాన్ని ఉచ్ఛరించారా, కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెల్యూట్ కొట్టిందా? 2002 వరకు నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జెండా ఎగిరిందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

బెంగాల్ ఎన్నికల కోసం ప్రజల మధ్య మరోసారి విభజన తీసుకుని రావడానికి, విచ్ఛిన్నకర శక్తులను ఉసిగొల్పడానికి జాతీయ గీతాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని, వ్యవస్థల మీద బీజేపీ అజమాయిషీ చర్చ రాకుండా నెహ్రూను దోషిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. విభజించు - పాలించు సిద్ధాంతాలను మళ్లీ ఆచరిస్తున్న మోదీ మరో అభినవ బ్రిటీషర్ అని, జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+