ఏపీలో ఇండియా కూటమి పోటీపై షర్మిల ప్రకటన-కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు..

దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించే లక్ష్యంతో జట్టు కట్టిన విపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలను శరవేగంగా పూర్తి చేస్తోంది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ల పంపకాలపై వరుసగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించింది. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్దితుల నేపథ్యంలో జాతీయ స్దాయిలో మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతోంది.

ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ విజయవాడలో కమ్యూనిస్టు నేతలతో చర్చలు ప్రారంభించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో సీపీఐ, సీపీఎం ప్రతినిధులతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఇవాళ జరుగుతున్న చర్చల్లో సీపీఎం నుంచి మాజీ ఎమ్మెల్యే గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు హాజరు అయ్యారు. సీపీఐ నుంచి రామకృష్ణ, నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్ హాజరయ్యారు.

ys sharmila declare congress-communists india bloc to fight ap polls

రాష్ట్రంలో ఈసారి 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లలోనూ తాము పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఇందులో మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ నెల 26న అనంతపురంలో జరిగే కాంగ్రెస్ జాతీయ నేతల సభకు కమ్యూనిస్టు నేతల్ని ఆమె ఆహ్వానించారు.

కమ్యూనిస్టులు నేరుగా పోటీ చేసే గెలిచే పరిస్దితులు లేనప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుల్ని ఐక్యం చేసి పరస్పర ఓట్లు బదిలీ చేసుకోగలిగితే కనీస సీట్లు సాధించే అవకాశాలు ఉంటాయని షర్మిల భావిస్తున్నారు. దీంతో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అసలే ఈసారి రాష్ట్రంలో వైసీపీ, విపక్షాల పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి చీల్చే ఓట్లు వారి జాతకాల్ని మార్చినా ఆశ్చర్యం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+