డిఫెన్స్‌లో పడ్డ చంద్రబాబు: రాజుకుంటోన్న డిమాండ్
YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో తెలుగుదేశం పార్టీతో పాటు కీలక భాగస్వామిగా ఉంటోన్న జనతాదళ్ (యునైటెడ్) ఈ డిమాండ్‌ను లేవనెత్తింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీయూ చీఫ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది.
తాజాగా- ఇదే అంశాన్నీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మల అందుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో 2014లో నిండు పార్లమెంట్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ గురించి ప్రస్తావించాలంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు.

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితీష్ కుమార్ తీర్మానం చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నితీష్ కుమార్ ఈ డిమాండ్ పెడితే.. చంద్రబాబు కనీసం నోరు విప్పట్లేదంటూ విమర్శించారు. మోదీ సర్కార్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాజధాని లేని లేకపోవడం వల్ల బిహార్ కంటే ఏపీ ఎంతో వెనకబడి ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా?, 15 సంవత్సరాల పాటు హోదా కావాలని అడిగిన రోజులు గుర్తు లేవా? అంటూ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ 20 సంవత్సరాలు వెనకబడిందని చెప్పింది కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు.
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే…
— YS Sharmila (@realyssharmila) July 1, 2024
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ సంకీర్ణ కూటమికి తాము ఇస్తోన్న మద్దతును ఉపసంహరించుకుంటామని చంద్రబాబు ఎందుకు మోదీని అడగట్లేదని ప్రశ్నించారు. హోదా ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి, మోసగించిన ప్రధాని మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేకపోతున్నారని అన్నారు.
ప్రత్యేక హోదాపై తన వైఖరి ఏమిటో చంద్రబాబు వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలని, హోదా డిమాండ్ కోసం పట్టు పట్టాలని అన్నారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధికి కావాల్సింది ప్రత్యేక ప్యాకేజీలు కాదని, హోదా ఒక్కటే మార్గమని షర్మిల స్పష్టం చేశారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications