YS Sharmila: కేవీపీ, రఘువీరాతో కలిపి కడపకు షర్మిల-అండగా వైఎస్ సన్నిహితులు..!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా తాజాగా ఎంపికైన వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రేపు విజయవాడలో ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ షర్మిల.. అంతకుముందే కడపలోని ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడప బయలుదేరారు.

హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న షర్మిల వెంట ఆమె తండ్రి దివంగత వైఎస్సార్ సన్నిహితులైన కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నారు. ఒకప్పుడు తన తండ్రితో కలిసి పనిచేసిన వీరిద్దరితో కలిసి షర్మిల ఇడుపుయపాయకు వెళ్లి నివాళులు అర్పిస్తారు. ఇవాళ సాయంత్రం ఐదున్నర తర్వాత కడపకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో షర్మిల, కేవీపీ, రఘువీరా ఇడుపుల పాయకు వెళ్తారు.

YS Sharmila departs to kadapa along with her fathers close aides kvp and raghuveera reddy

ఇప్పటికే వైఎస్ షర్మిల కడప జిల్లాలో గతంలో తన తండ్రికి సన్నిహితులుగా మెలిగి ఆయన మరణం తర్వాత సైలెంట్ గా ఉంటున్న పలువురు కాంగ్రెస్ నేతలతో ఫోన్ లో టచ్ లోకి వెళ్లి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నేరుగానే కేవీపీ, రఘువీరా వంటి వైఎస్ సన్నిహితులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్న షర్మిల.. ఇవాళ రాత్రికి వీరితో పాటు మరికొందరితో చర్చించే అవకాశాలున్నాయి. అలాగే వీరితో కలిసి రేపు ఉదయం విజయవాడకు చేరుకుని పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+