• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనన్నకు.. వదినమ్మకు షర్మిళ గ్రీటింగ్స్ : ఫొటోలను షేర్ చేస్తూ : వైరల్ గా మారిన పోస్టింగ్ ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆయన సతీమణి భారతికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సోదరి షర్మిళ తన ఫేస్ బుక్ ఖాతాలలో చేసిన పోస్టింగ్ ద్వారా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. షర్మిళ తన ఖాతా నుండి అన్నయ్య,వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ గ్రీట్ చేసారు. దీనికి జగన్..భారతి పెళ్లి నాటు ఫొటో జత చేసారు. దీంతో పాటుగా వారి వివాహ ఆహ్వాన పత్రికను పోస్ట్ చేసారు. అదే రోజు జగన్ .. భారతితో పాటుగా వైయస్ వివేకా కుమార్తె సునీత వివాహం సైతం ఒకే వేదిక మీద జరిగింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండటం...షర్మిళ పోస్టింగ్ తో ఇవాళ్టి రోజు అందరికీ తెలియటంతో పెద్ద ఎత్తున అభినందలు ట్విట్టర్.. ఫేజ్ బుక్ ద్వారా వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ పెళ్లి రోజు..
ముఖ్యమంత్రి జగన్..భారతి పెళ్లి రోజు శుభాకాంక్షలను షర్మిళ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. చేశారు. షర్మిల చేసిన పోస్టింగ్ తో జగన్ పెళ్లి ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరి వివాహం అగస్టు 28,1996లో పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగింది. జగన్ తండ్రి రాజారెడ్డి తన కుమారుడైన వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ..పులివెందులకే చెందిన గంగిరెడ్డి కుమార్తె భారతితో వివాహం నిశ్చియించారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సైతం రాజారెడ్డి పేరుతోనే ముంద్రించారు. అదే విధంగా రాజారెడ్డి మరో కుమారుడైన వైయస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె సునీత వివాహం సైతం జగన్ పెళ్లి తో పాటే నిర్వహించారు. అదే వేదిక మీద జరిగింది.

YS Sharmila greeted her brother Jagan and Bharathi on their wedding anniversary. Now this tweet became viral

సునీత పెద్దగా ఎప్పడూ వార్తల్లోకి రాలేదు. వైయస్ వివేకా హత్య తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం.. హైకోర్టు లో కేసు దాఖలు చేయటం .. కేంద్ర హోం శాఖ అధికారులను కలవటం ద్వారా సునీత బయట ప్రపంచానికి తెలిసారు. ఇక, జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే వరకూ ఆయన వ్యాపారాలతోనే బీజీగా ఉండేవారు. ఇక, వైయస్ మరణం తరువాత జగన్ తో పాటుగా భారతి సైతం ప్రజలకు బాగా దగ్గరయ్యారు. జగన్ అరెస్ట్ సమయంలో భారతి..షర్మిళ..విజయమ్మ ముగ్గురూ వ్యాపార.. పార్టీ బాధ్యతలను చేపట్టారు. జగన్ జైళ్లో ఉన్నా.. కేసులు.. విమర్శలు ఎదురైనా భారతి అటు వ్యాపారాలను చూస్తూనే.. కుటుంబ బాధ్యతలను నిర్వహించారు.

YS Sharmila greeted her brother Jagan and Bharathi on their wedding anniversary. Now this tweet became viral

శుభాకాంక్షల వెల్లువ.. అండగా భారతి..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి వివాహ వార్షికోత్సవం కావటంతో షర్మిళతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు. జగన్ అరెస్ట్ సమయంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పక్కనే ఉన్న దిల్ కుష్ గెస్ట్ హౌస్ వద్ద జగన్ ను అరెస్ట్ చేసిన తీసుకెళ్తున్న సమయంలో అక్కడికి వచ్చిన విజయమ్మ..భారతి..షర్మిళ తో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో..ఆ ముగ్గురూ అక్కడే రోడ్డు పక్కన ఫుట్ పాత్ పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇక, జగన్ వ్యాపారాలు..కుటుంబాన్ని వదిలేసి పూర్తిగా జనంలోనే ఉండిపోయారు. ఆ సమయంలో పూర్తి బాధ్యతలు భారతి స్వీకరించారు. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నాడు వైయస్ మరణంతో ఆవేదనతో ఖాళీ చేసిన బిల్డింగ్ లోకి ముఖ్యమంత్రి హోదాలో జగన్..భారతి తిరిగి కాలు పెట్టారు. అక్కడ ప్రస్తుతం ఉంటున్న తెలంగాన ముఖ్యమంత్రి ఆ ఇద్దరికీ ఘన స్వాగతం పలికారు. ఏ రోడ్డులో అయితే భారతితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారో అదే రోడ్డులో జగన్..భారతి వస్తున్న వాహనం కోసం రోడ్డు క్లియర్ చేసి.. స్వాగతం పలికారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి వివాహ దినోత్సవం కావటంతో.. కుటుంబ సభ్యుల మొదలు పార్టీలోని సీనియర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

English summary
YS Sharmila greeted her brother Jagan and Bharathi on thier wedding anniversary. Now this tweet became viral in social media. family members and party seniors greeted CM jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X