షర్మిల హౌస్ అరెస్ట్: లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్
YS Sharmila: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ఉదయం 10: 30 గంటల సమయంలో విజయవాడలోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. హౌస్ అరెస్ట్‌లో ఉంచారు. బయటికి వెళ్లడానికి అనుమతి లేదంటూ స్పష్టం చేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హుటాహుటిన షర్మిల ఇంటికి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆమెను ఎందుకు హౌస్ అరెస్ట్‌లో ఉంచారంటూ నిలదీశారు. దీనిపై పోలీసుల నుంచి ఎటువంటి స్పష్టమైన కారణం రాలేదని చెబుతున్నారు.

తనను అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ షర్మిల ఆరోపించారు. ఎందుకు గృహ నిర్బందంలో ఉంచారో కనీసం కారణమైనా చెప్పాలంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో తనను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారని ప్రశ్నించారు. కారణం ఏమిటంటూ నిలదీశారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. పీసీసీ కార్యాలయానికి వెళ్లడం కూడా నేరమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారని, ఎలా ఉత్పన్నమౌతుందో చెప్పలేకపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందంటూ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని నిలదీశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేస్తోన్న తప్పులు, తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడమే నేరమైందా అని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసులను ఉపయోగించుకోవాలే తప్ప వారి కోసం పోరాడుతున్న నాయకులను అడ్డుకోవడానికి, హౌస్ అరెస్ట్ చేయడానికి కాదని షర్మిల అన్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో సామాన్యులకు కనీస రక్షణ లేదని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు వాళ్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణంలో గానీ చోటు చేసుకుంటోన్న భారీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారని, ప్రతిపక్ష పార్టీలు ఉన్నవే ప్రభుత్వంలోని లోపాలను తెలియజేయడానికేనని షర్మిల చెప్పారు. పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications