జగన్ నియంతలా మారి.. వైఎస్ ట్యాగ్ అందుకే..షర్మిల తాజా విమర్శలు..!
ఏపీ రాజకీయాల్లో పీసీసీ ఛీఫ్ గా ఎంట్రీ ఇచ్చాక అన్న వైఎస్ జగన్ పై ఎవరూ ఊహించని స్ధాయిలో మాటల దాడి ప్రారంభించిన వైఎస్ షర్మిల దాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన,సామాజిక న్యాయం, తన పేరుకు ముందు వైఎస్ ట్యాగ్ పెట్టుకోవడం వంటి అంశాలపై ఇవాళ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంపాదన కోసం అన్న దగ్గరికి వెళ్లానంటూ చేస్తున్న విమర్శలపైనా స్పందించారు.
రాష్ట్రంలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటూ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు.
రాష్ట్రంలో ఎవరూ కితాబు ఇవ్వకపోతే తన విలువ తగ్గినట్లూ కాదు, పెరిగినట్లూ కాదని షర్మిల తెలిపారు. తాను వైఎస్ కూతురిని అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానంటూ తాజాగా మోర్సుపల్లి ఇంటిపేరుతో చేస్తున్న విమర్శలకు జవాబుగా వ్యాఖ్యానించారు. తన కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానన్నారు.

అలాగే తనకు చాలా దగ్గర మనిషి అయిన బొండా రాఘవరెడ్డి తాను అన్న జగన్ ను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడటంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా బొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా... మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలనన్నారు. అక్రమంగా సంపాదించుకోడానికి తన భర్త అనిల్ తో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని ఆక్షేపించారు. తాను ఏమీ ఆశించి ఈరోజు వరకూ తన అన్న వద్దకు వెళ్ళలేదన్నారు. దానికి సాక్ష్యం తన తల్లి విజయలక్ష్మి అన్నారు. దమ్ముంటే మా అమ్మను అడగండని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయని తాజాగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కోట్టి అవమానిస్తున్నారన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు.












Click it and Unblock the Notifications