సీబీఐ ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరు , సోనియా క్లారిటీ ఇచ్చారు- షర్మిల..!!
వైఎస్సార్ వర్దంతి నాడు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ పేరు నాడు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చటం కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ తో జరిగిన సమావేశంలో అంశాలను వెల్లడించారు. వైఎస్ కుటుంబంపై వారి మాటల్లో గౌరవం కనిపించందన్నారు. వైఎస్సార్ లోని లేటు కనిపిస్తోందని రాహుల్ చెప్పారని వివరించారు. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని వారు అంటున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరు : వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఆ వెంటనే హైదరాబాద్ చేరుకున్న షర్మిల పార్టీ నేతలో కలిసి వైఎస్సార్ వర్దంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తాను ఢిల్లీలో సోనియా, రాహుల్ తో జరిపిన చర్చలపైన క్లారిటీ ఇచ్చారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ అని మ వాళ్ళే తనను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. తాను వైఎస్సార్ విగ్రహం సాక్షిగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఆ విషయం చెప్పక పోతే వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదని వ్యాఖ్యానించారు. ఇదే అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చానని షర్మిల చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ తెలియక చేసిన పొరపాటు : ఆ సమయంలో రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చారు అని చెప్పారని షర్మిల వివరించారు. ఆ బాధ ఎంటో తమకు తెలుసు అని అన్నారని పేర్కొన్నారు. తమకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తాం అన్నారని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పై తమకు అపార మైన గౌరవం ఉంది అన్నారని చెప్పారు.
వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామంటూ ప్రశ్నించారని షర్మిల వివరించారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుంది అన్నారన్నారు. తనకు అర్థమైంది ఏమిటి అంటే..వాళ్ళు తెలియక చేసిన పొరపాటేనంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చటం కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల స్పష్టం చేసారు.

వైఎస్సార్ కు గౌరవం ఇస్తున్నారు : వైఎస్సార్ ను సోనియా , రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారన్నారు. తాను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియా తో ,రాహుల్ తో చర్చలు జరిపానని షర్మిల వెల్లడించారు. వాళ్ళు రియలైజేషన్ కి వచ్చారని షర్మిల విశ్లేషించారు. అర్థం చేసుకోవాల్సిన భాధ్యత తనదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను పాలేరు లో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తానని స్పష్టం చేసారు.
ఇక, తెలంగాణలో కేసీఆర్ పాలకు కౌంట్ డౌన్ మొదలైందని..తెలంగాణ ప్రజల పక్షాన తాను పోరాటం చేస్తానని చెప్పారు. తాను నిలబడతానని..కార్యకర్తలను నిలబెట్టుకుంటానని షర్మిల వివరించారు. త్వరలోనే అందరితో సమావేశమై భవిష్యత్ నిర్ణయాలను ప్రకటిస్తానని షర్మిల వెల్లడించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications