అవినాష్ రెడ్డిని మార్చేస్తున్నారు-జగన్ సమాధానం చెప్పాల్సిందే-షర్మిల కామెంట్స్..!
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజక వర్గంలో ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన సోదరి సునీతారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాను కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు రోజులే అయిందని, తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందన్నారు. దీనికి నిదర్శనమే అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చాలన్న వైసీపీ ప్రయత్నాలన్నారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారని సీఎం జగన్ ను షర్మిల ప్రశ్నించారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారు అని ఎందుకు మార్చాలని చూస్తున్నారన్నారు. దీనిపై కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని జగన్ ను ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లుగా హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడని, అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టిందని షర్మిల తెలిపారు.
అయినా ఎటువంటి చర్యలు లేవన్నారు.

అవినాష్ రెడ్డి దోషి అని తెలిసినా సీబీఐ ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయిందని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాన్నారు. అన్యాయం ఒక వైపు, అధర్మం ఒకవైపు, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, ఆ తాను 5 రోజులుగా కడపలో ప్రచారం చేస్తున్నానని, తమ ప్రచారానికి వైసిపీలో వణుకు పుడుతుందన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా,మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు వివేకా రాజకీయ అజాత శత్రువని ఆయన కుమార్తె సునీత గుర్తుచేశారు. ఆయనకు ఎవరి మీద కోపం ఉండదన్నారు. పని కావాలి అంటే వెంట తీసుకొని వెళ్ళేవాడన్నారు.అటువంటి మంచి మనిషిని దారుణంగా నరికి చంపారని ఆరోపించారు.తలమీద ఏడు సార్లు గొడ్డలితో నరికారన్నారు. తమ కుటుంబ సభ్యులే చంపారు అని తెలిసి ఎంతో బాధ పడ్డామన్నారు.వివేకా హత్య తమ సొంత విషయం కాదని, ఇది కడప జిల్లా ప్రజల విషయం అన్నారు. శాంతి,భద్రతల అంశమన్నారు.హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని, హత్యచేసిన నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నామన్నారు.న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల రెడ్డిని గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications