వైజాగ్ పై జగన్ కమిట్మెంట్ ఇదే! వైఎస్ షర్మిల సెటైర్లు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ మూడేళ్లుగా చెబుతున్న జగన్.. ఇప్పటివరకూ ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా మరోసారి ఎన్నికల తర్వాత విశాఖను రాజధాని చేస్తామని, ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తానంటూ జగన్ చేసిన ప్రకటనపై పీసీసీ ఛీఫ్ షర్మిల స్పందించారు.
పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? అంటూ సీఎం జగన్ ను షర్మిల ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ విమర్శించారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అని సెటైర్లు వేశారు.

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
— YS Sharmila (@realyssharmila) March 6, 2024
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం…
రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అంటూ వైఎస్ షర్మిల జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అంటూ జగన్ ను టార్గెట్ చేశారు. ఇప్పటికే వైజాగ్ తరలింపు పేరుతో జగన్ చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ విమర్శలు చేస్తుండగా.. ఈ కోవలో ఇప్పుడు షర్మిల కూడా చేరారు.












Click it and Unblock the Notifications