కాంగ్రెస్ కు తిరిగి ప్రాణం పోస్తా..! పీసీసీ ఛీఫ్ గా నియామకంపై షర్మిల భావోద్వేగం..!

ఏపీలో పీసీసీ ఛీఫ్ గా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకే చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబడాలంటే పోరాడక తప్పని పరిస్ధితుల్లో షర్మిలపై అధిష్టానం నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించింది.

ఈ నేపథ్యంలో తనకు పీసీసీ ఛీఫ్ పదవి కట్టబెట్టడంపై వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష పదవి విషయంలో తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ కి పునర్ వైభవం తెచ్చేందుకు నమ్మకంగా పూర్తి నిబద్ధతతతో, చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు.

ys sharmila reacts on appointment as apcc chief, assured to revive congress party in ap

అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్, ఎంపీ మాణిక్కం ఠాకూర్ కి కూడా షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు ప్రతీ కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు షర్మిల తెలిపారు. అలాగే తన కోసం పీసీసీ ఛీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర నేతల మద్దతు కూడా కోరుతున్నానన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు, వారి అనుభవం, నైపుణ్యంతో తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నానని షర్మిల వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+