ఆస్తుల విషయంలో షర్మిల కీలక నిర్ణయం - బదలాయింపు..!!

వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి జన్మదినం నాడు తల్లి..తన కుమార్తె, కుమారుడుతో కలిసి షర్మిల కడప చేరుకున్నారు. ఆ వెంటనే వేంపల్లెలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన ఆస్తులను తన పిల్లలకు బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు. షర్మిల ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఇడుపులపాయలో తండ్రి ఘాట్ వద్ద షర్మిల నివాళి అర్పించనున్నారు.

కుమారుడు..కుమార్తెకు బదిలీ : ఇడుపులపాయలో తనపేరుపై ఉన్న కొన్ని ఆస్తులను తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలీల పేరుపై వైయస్ షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. ఇడుపులపాయలో తన పేరిట ఎన్న 9.53 ఎకరాల భూమిని తన కుమారుడు రాజారెడ్డి పేరిల దాన విక్రయం రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి 2.12 ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె అంజలీరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.

yssharmila1

హైదరాబాద్ నుంచి ముందుగానే వచ్చిన షర్మిల సిబ్బంది రిజిస్ట్రేషన్ కు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంగా కడప చేరుకున్న షర్మిల, అక్కడ నుంచి నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ పూర్తి చేసారు. ఆ తరువాత ఇడుపులపాయ నివాసానికి చేరుకున్నారు.

రాజకీయ నిర్ణయం దిశగా : ఇక షర్మిల రాజకీయంగానూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్టీపీని షర్మిల స్థాపించారు. సుదీర్ఘ పాదయాత్ర..దీక్షలు..రాజకీయ పోరాటం చేసారు. కానీ , ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆఫర్ వచ్చింది. పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు.

తొలుత పార్టీ వీలీనం పైన షర్మిల సానుకూలంగా స్పందించ లేదు. కాంగ్రెస్ లో చేరుందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే కొందరు తెలంగాణ ముఖ్య నేతలు షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని కోరుతున్నారు. అందుకు షర్మిల ససేమిరా అంటున్నారు. తెలంగాణలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు.

yssharmila1

పాలేరులో తేల్చేస్తారా : ఈ అంశం పైనే ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ లో చేరటం అంశం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు వైఎస్సార్ జన్మదినం నాడు తండ్రికి నివాళి అర్పించిన తరువాత షర్మిల హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరు వెళ్లనున్నారు. వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ రోజునే తన రాజకీయ నిర్ణయం షర్మిల ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పాలేరు పైన హామీ దక్కినట్లు సమాచారం. ఈ రోజు పాలేరు వెళ్లనున్న షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటంతో పాటుగా తన రాజకీయ భవిష్యత్ కార్యచరణ పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+