YS Sharmila: బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి-జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు..!

ఏపీలో అన్న వైఎస్ జగన్ తో నెలకొన్న ఆస్తుల వివాదం విషయంలో విమర్శలు గుప్పిస్తున్న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగే మనిషని, ఆయన జగన్ పక్కనే ఉన్నారని, జగన్ ఇచ్చిన పదవులు అనుభవిస్తున్నారు, కాబట్టే అలా మాట్లాడుతున్నారన్నారు. సుబ్బారెడ్డి రాజకీయంగా లబ్ది పొందితే, ఆయన కొడుకు జగన్ హయాంలో ఆర్ధికంగా లబ్దిపొందారన్నారు.

సుబ్బారెడ్డే కాదని, సాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడవచ్చని షర్మిల తెలిపారు. సాయిరెడ్డి వాళ్ల టీమ్ లోనే ఉన్నారని, వాళ్ల మోచేతి కిందే ఉన్నారని, ఆయన కూడా ఇలాగే మాట్లాడినా ఆశ్చర్యం లేదన్నారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి జగన్ పక్షాన ఉన్నారని తెలిసినా వాళ్ల పేర్లు పెట్టి తాను జగన్ కు లేఖ రాశానన్నారు. వాళ్లలో ఏమైనా నిజాయితీ మిగిలి ఉందేమో చూద్దామని అలా రాశానన్నారు. వీళ్ళందరికీ వైఎస్ఆర్ తెలుసు, ఆయన మనోభావాలు కూడా తెలుసన్నారు.

ys Sharmila sensational remarks on ys jagan s legal battle laments on uncle yv subbareddy remarks
తాను చెప్తున్నది నిజమని ప్రమాణం చేయగలనని, సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుందన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి,సాక్షి సిమెంట్స్ లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాట ఉండాలన్నారని, ఇది ప్రమాణంగా చెప్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ఏమైందని జగన్ అన్నను అడిగానని, జగన్ నాన్నకు మాట ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పాడన్నారు. డోంట్ వర్రీ డాడ్ అన్నాడన్నారు. ఇది నిజం అని తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తానన్నారు.

వైవీ సుబ్బారెడ్డి కూడా తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలన్నారు.సాక్షి కి, భారతి సిమెంట్స్ కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారని సుబ్బారెడ్డి అంటున్నాడని,అందుకే ఆ ఆస్తులు వాళ్లవేనట అని షర్మిల వ్యంగాస్త్రాలు సంధించారు. అందులో నాకు హక్కు లేదట అన్నారు. జగన్ సొంతగా సంపాదించాడట, ఆరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే తాను అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేసారు. పేర్లతో ఏముంది అనుకున్నానని, అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నానని తెలిపారు. వాళ్ళ పేర్లతో ఆస్తులు ఉంటే...నిజంగా వాళ్లవి అవుతాయా అని నిలదీశారు.

తన పేరు మీద ఆస్తులు రాసి ఉంటే తాను ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటున్నారని షర్మిల అన్నారు. ఏ అన్న అయినా చెల్లెలు గిఫ్ట్ అంటే ఏ బంగారమో చీరనో గిఫ్ట్ ఇస్తారు, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా అని ప్రశ్నించారు. ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు తన హక్కు అన్నారు. తన హక్కు కాబట్టే తనకు ఇస్తామని అన్నారన్నారు. ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి MOU రాశారని గుర్తుచేసారు. MOU రాయమని తాను అడగలేదని, సరస్వతి సిమెంట్స్ ఈడీ అటాచ్ లో లేదని తెలిపారు. అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు.

ప్రతి ఇంట్లో ఉండే కహాని అని జగన్ చెప్తున్నాడని, ఇంత సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నారని షర్మిల అడిగారు. మీకు సెంటిమెంట్ లేదా అని జగన్ ను ప్రశ్నించారు. ఎమోషన్ లేదా అని అడిగారు. ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదని, నా సొంత చిన్నాన్న అంటే తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయన్నారు. చిన్నాన్న నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ? నా బిడ్డలను మీరు తాకలేదా అని సుబ్బారెడ్డిని అడిగారు. దేవుడు అంతా చూస్తున్నాడని, అంతా గమనిస్తున్నాడని తెలిపారు.

2019 లో వైసీపీ ప్రభుత్వం 151 స్థానాలు గెలిచి ఏర్పడిందని, ఇది అప్పుడు అఖండ విజయమని, ఇది అప్పుడు ఎలా సాధ్యం అయింది, ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అనుకుంటే వచ్చింది షర్మిల వైసీపీ అభిమానులకు తెలిపారు. ఎంతో కష్టం పడితే...త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. తానే కాదు...అమ్మే కాదు..ఎంతో మంది త్యాగాలు చేశారని, తాను, అమ్మ ఇద్దరం తమ శక్తి కి మించి పని చేశామన్నారు. అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉండేవని, బాధలు భరించి ఏడ్చుకుంటూ పార్టీ కోసం కష్టం చేసిందని గుర్తుచేసుకున్నారు. తాను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. తనను పాదయాత్ర చేయమని అడిగితే చేశానన్నారు.

తనకు జగన్ అన్న అంటే ప్రాణమని, వైసీపీని అడుగుతున్నా..నేను మీకు ఏం అన్యాయం చేశా అని షర్మిల ప్రశ్నించారు. ఒక్క కారణం చెప్పండన్నారు. మీకు ఏం అవసరం వస్తే అవసరానికి మించి తిరిగానన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేయమని అడిగితే చేశానన్నారు. ఓదార్పు యాత్ర చేశానని, బై బై బాబు అంటూ చేసిన క్యాంపెయిన్ దేశంలో పెద్దదన్నారు. మీకు ఇన్ని చేస్తే... మీరు నాకు ఏం చేశారని ప్రశ్నించారు. మీరు నాకు,నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇది అమ్మకు తెలుసు ..అందరికీ తెలుసన్నారు.

5 ఏళ్లు జగన్ రాసి ఇచ్చిన MOU తన చేతుల్లో ఉన్నా,తనకు అవసరం వచ్చినా బయట పెట్టలేదన్నారు. MOU బయటకు పోతే వైఎస్ఆర్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారని, నాన్న పేరు చెడగొట్టడం తనకు ఇష్టం లేదని తెలిపారు. తనకు వేరే స్వార్థం ఉంటే, ఏదో ఒక మీడియా హౌజ్ కి ఇచ్చే దాన్ని కదా అన్నారు. ఇవ్వాళ అందరి చేతుల్లో MOU ఉందని, దీనికి కారణం నువ్వు కాదా అని జగన్ ను ప్రశ్నించారు. సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇది చూడటానికి తాను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుందన్నారు.

బెయిల్ రద్దు చేసేందుకు తాను ఈ కుట్ర పన్నాను అంటున్నాడని, అందుకే కోర్టుకి తల్లిని ఈడ్చాడట అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటావా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ చనిపోయాక...CBI ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా ? అని అడిగారు. ఛార్జ్ షీట్ లో పెట్టక పోతే... బెయిల్ రాధని చేర్చిన మాట నిజం కాదా ? నీ లబ్ధికి అమ్మా నాన్నలను వాడుకుంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు మీరే ఆలోచన చేసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+