హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి రాజధానుల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల వేళ రాజధాని లేని రాష్ట్రం పేరుతో విపక్షాలు టార్గెట్ చేస్తుంటే వైసీపీ దీనికి విరుగుడుగా విశాఖ రాజధాని కట్టుకునే వరకూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతోంది. ఇదే ఇప్పుడు విపక్షాలకు మరో అస్త్రంగా మారిపోతోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు.

మరో రెండేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అడుగుతున్నారంటే ఇన్నాళ్లూ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అంటూ వైఎస్ షర్మిల ఇవాళ విరుచుకుపడ్డారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని అన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారమిస్తే విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదని షర్మిల ఆక్షేపించారు. ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం పూర్తి కాలేదని మండిపడ్డారు.

ys sharmila slams ysrcps hyderabad joint capital demand, termed it for diverting capital failures

రాష్ట్రంలో కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదని షర్మిల విమర్శించారు. కొత్త పరిశ్రమలు లేవని, ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని షర్మిల వ్యాఖ్యానించారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా...అభివృద్ధి చూపలేదని ఆరోపించారు. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందన్నారు.

చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది త్రీడీ గ్రాఫిక్స్ అయితే... మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అన్నారు. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమన్నారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప.. వైసీపీ కి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని షర్మిల పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+