బడ్జెట్ సమావేశాల వేళ.. రేపు ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష; పక్కా వ్యూహం!!
నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం 17వ లోక్ సభ చివరి సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ ఈ బడ్జెట్ సమావేశాలలో అందుకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్లనుంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై అనేక డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఢిల్లీ వేదికగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిల వచ్చే ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రజా మద్దతును కూడగట్టడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న షర్మిల తాజాగా కేంద్ర బడ్జెట్ సమావేశాలను ప్రత్యేక హోదా డిమాండ్ కోసం పోరాటం చేయడానికి వేదికగా చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె నేడు ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు.
ఇక నేడు ఢిల్లీ కేంద్రంగా సిపిఐ, సిపిఎం తో సహా జాతీయ పార్టీల నాయకులను కలిసి తాను చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని వైఎస్ షర్మిల కోరనున్నారు. ఏపీ సమస్యలపై ఢిల్లీ వేదికగా షర్మిల చేయనున్న పోరాటం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్లస్ అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications