రక్త సంబంధం లేకపోయినా - షర్మిల ట్వీట్ వైరల్..!!
పీసీసీ చీఫ్ షర్మిల రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు చెబుతూ పోస్టు చేసారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ పోస్టు పైన స్పందిస్తున్నారు. గతంలో ప్రతీ రాఖీ పర్వదినం నాడు షర్మిల తన అన్న జగన్ కు రాఖీ కట్టేవారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చిన తరువాత దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ తన అన్నకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ రోజు షర్మిల చేసిన ట్వీట్ లోనూ ప్రత్యేకత కనిపిస్తోంది.
షర్మిల రాఖీ సందేశం ఇస్తూ ట్వీట్ చేసారు. అందులో.. నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. YSR అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి,అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ... రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. వెలకట్టలేని బంధాలను,వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం.దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్ధన...అని పేర్కొన్నారు.

తన ట్వీట్ తో పాటుగా రాహుల్ తో సహా కాంగ్రెస్ నేతలు ఉన్న ఫొటోను జత చేసారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన బంధంతో తనకు తోబుట్టువుల్లాగ నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ పైన నెటిజెన్లు స్పందించారు. సొంత అన్నను కాదని ఇలా ట్వీట్ చేయటం ఏంటి అక్కా అంటూ ప్రశ్నలతో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. నీవు రాఖీ కట్టకపోయినా జగన్ అన్నకు ఎంతో మంది చెల్లెల్లు ఉన్నారంటూ గతంలో జగన్ కు వైసీపీ నేతలు రాఖీ కట్టిన ఫొటోను అభిమానులు షేర్ చేసారు. ప్రస్తుతం షర్మిల రాఖీ స్పెషల్ సందేశం పోస్ట్ వైరల్ అవుతోంది.
నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. YSR అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి,అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ … రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. వెలకట్టలేని బంధాలను,వదులుకోలేని అనుబంధాలను… pic.twitter.com/b9wfDEDy57
— YS Sharmila (@realyssharmila) August 19, 2024












Click it and Unblock the Notifications