కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునీతది యూటర్న్-వివేకాది గుండెపోటని అవినాష్ చెప్పలేదు- కడప వైసీపీ నేతల క్లారిటీ

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా వివేకా కుమార్తె సునీతారెడ్డి వాంగ్మూలంలో బయటపడిన అంశాలు వైఎస్ కుటుంబాన్ని ఇరుకునపెట్టే అవకాశం ఉండటంతో వైసీపీ దీనిపై మండిపడుతోంది. ఇదే క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య తర్వాత మాట్లాడిన అంశాలు హైలెట్ అవుతుండటంతో ఇప్పుడు వాటిపై కడప వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టారు.

సునీత వాంగ్మూలం కలకలం

సునీత వాంగ్మూలం కలకలం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మిగతా వారు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ ఓ ఎత్తు, ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మరో ఎత్తుగా మారిపోయింది. ముఖ్యంగా తన తండ్రి హత్యకు తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే కారణమని పరోక్షంగా ఆరోపించడంతో పాటు ఈ కేసును సీబీఐకి ఇస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడంటూ జగన్ చెప్పారంటూ సునీత ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతోంది

 సునీతది యూటర్న్ అన్న కడప నేతలు

సునీతది యూటర్న్ అన్న కడప నేతలు

వివేకా హత్య కేసులో సునీతారెడ్డి గతంలో మాట్లాడిన విషయాలు, ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలకు పొంతన లేదని

కడప వైసీపీ నేతలు ఆరోపించారు. వివేకా హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కడప మేయర్ సురేష్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు సునీతారెడ్డి వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివేకా కుమార్తె సునీతమ్మ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై వచ్చిన ఆరోపణలపై ఖండించారని వారు గుర్తుచేశారు. కుటుంబ సభ్యులు ఎందుకు హత్య చేస్తారని ఆమె మండిపడ్డారని తెలిపారు. కానీ ఇప్పుడు ఎంపీ వైఎస్ అవినాష్ పై అనవసరంగా నిందలు మోపాలని చూస్తున్నారని ఆరోపించారు.ఆమె టీడీపీ ట్రాప్ లో పడటం వల్లే అలా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.

 అవినాష్ గుండెపోటని చెప్పలేదు

అవినాష్ గుండెపోటని చెప్పలేదు

వివేకానందరెడ్డి హత్యపై ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోందని కడప వైసీపీ నేతలు మండిపడ్డారు. హత్య జరిగిన సమయంలోనే వివేకా నుదుటి పై , వెనుక వైపు గాయాలు ఉన్నాయని ఎంపీ వైఎస్ అవినాష్ చెప్పారని వారు తెలిపారు.

కానీ ఇప్పుడు వైఎస్ అవినాష్ గుండెపోటు అని చెప్పారని దుష్ప్రచారం చేస్తున్నారని వారు విమర్శించారు.
అప్పటి ఇంటలిజెన్స్ డిజి ఏబీ వెంకటేశ్వర రావు కనుసన్నల్లో అధికారులు నడిచారని, అప్పట్లో మాట్లాడిన వాయిస్ అన్ని ఛానెల్స్ దగ్గర ఉన్నాయని కడప వైసీపీ నేతలు తెలిపారు. హత్య జరిగిన సమయంలో మీడియాతో ఎంపీ వైఎస్ అవినాష్ మాట్లాడిన వీడియోలను వైసీపీ నేతలు ప్రెస్ మీట్లో ప్రదర్శించారు. అందులో హత్య పై అనుమానాలు ఉన్నాయని ఎంపీ స్పష్టం చేశారన్నారు. హత్య జరిగిన మూడేళ్ళ తర్వాత ఇప్పుడు టీడీపీ నేతలు ఎంపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవినాష్ రెడ్డి గుణం, వ్యక్తిత్వం మంచితనం జిల్లా ప్రజలకు తెలుసన్నారు.

 సీబీఐ వారినెందుకు విచారించదు ?

సీబీఐ వారినెందుకు విచారించదు ?

వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కడప వైసీపీ నేతలు కోరారు. బిటెక్ రవి, సూర్యప్రకాష్ రెడి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ని కూడా సీబీఐ విచారణ జరపాలన్నారు. హత్య ఎవరు చేసారనేది ఎప్పటికైనా నిరూపణ అవుతుందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను కొన్ని గ్రామాల్లోకి రానివకుండా అడ్డుకున్నారని వారు గుర్తుచేశారు. వివేకా కేసులో కర్త ,కర్మ క్రియ కలిగిన వ్యక్తి చంద్రబాబని, ఆయన్ను విచారించాలన్నారు. కుట్రదారులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

 పులివెందులలో సునీత, కడపలో ఆదినారాయణరెడ్డి ?

పులివెందులలో సునీత, కడపలో ఆదినారాయణరెడ్డి ?

తాజా పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో సునీత టీడీపీ పులివెందుల అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదని కడప వైసీపీ నేతలు జోస్యం చెప్పారు. తిరిగి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ లోకి వచ్చినా చూస్తూనే ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉచ్చులో వివేకా కుమార్తె సునీత పడినట్లు ఉందన్నారు.ప్రతి రోజు ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దివంగత రాజారెడ్డి ని, వంగవీటి ని హత్య చేసింది ఎవరనేది అందరికి తెలుసని, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబని గుర్తుచేశారు. సునీతమ్మ దయచేసి చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని వైసీపీ నేతలు కోరారు.

English summary
kadapa ysrcp leaders suresh babu and settipally raghurami reddy alleged that ys suneetha reddy has took u turn on his father late ys vivekananda reddy's murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X