వైఎస్ భారతి తనని నరికేస్తారంటూ..సునీత షాకింగ్ కామెంట్స్
ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా అంటే.. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అని..ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దని సునీత, షర్మిల రొడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో సునీత విమర్శల దాడి ఉదృతం చేసింది.
తాజాగా సునీత సీఎం జగన్ భార్య భారతిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైఎస్ భారతిపై వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షర్మిలను లేదా తనను భారతి నరికేస్తారని అన్నారు. భారతి సింగిల్ ప్లేయర్‌గా ఉండాలంటే అదొక్కటే అవకాశం అని చెప్పుకొచ్చారు. వివేకాను జగన్‌ని ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని చెప్పారు. ప్రస్తుతం సునీత చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications