కార్యవర్గ భేటీకి విజయమ్మ, పార్టీ ఆందోళన బాట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యవర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యవర్గ సమావేశం జరిగింది.
రుణమాఫీ, సంస్థాగతంగా పార్టీ బలోపేతం పైన వారు చర్చించారు. రుణమాఫీని అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మండల, జిల్లా స్థాయిలలో నిరసనలు చేపట్టాలని అధినేతకు పలువురు సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపంతే చేసేందుకు గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.

లోటస్ పాండులో ఈ సమావేశం జరిగింది. పార్టీ పటిష్టత పైన ప్రధానంగా చర్చ సాగింది. గ్రామస్థాయి నుండి నిర్మాణం పైన దృష్టి సారించాలని నిర్ణయించారు.
ప్రజా సమస్యల పైన ప్రధాన ప్రతిపక్షంగా స్పందించాల్సిన అంశాల పైన చర్చించారు. కాగా, రుణమాఫీ అమలు కోసం మండల, జిల్లా స్థాయిలో త్వరలో ఆందోళనలు చేపడతామని, అయినప్పటికీ ప్రభుత్వం తగ్గకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని వాసిరెడ్డి పద్మ చెప్పారు.












Click it and Unblock the Notifications