సర్వే చేస్తున్నాం:విజయమ్మ, హజారేకంటే నేనే:శంకరన్న
హైదరాబాద్: 2014 ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన సర్వే జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా ఆమె మాట్లాడారు.
సభలో సమైక్య తీర్మానం తర్వాతనే విభజన ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. తీర్మానం జరిగాక తాము చర్చకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీహార్‌లో తీర్మానం లేకుంటే బిల్లు వెనక్కి పంపారని, ఈ విషయం అక్కడ అధ్యయనం కోసం వెళ్లి వచ్చిన సభాపతికి తెలియదా అని ప్రశ్నించారు. సమైక్య తీర్మానం చేయకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవన్నారు.

శాఖ మారగానే చర్చ గుర్తుకొచ్చిందా?
మంత్రి శైలజానాథ్‌కు తన శాఖ మారగానే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ గుర్తుకు వచ్చిందా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి అన్నారు. ఇంతకుముందు తీర్మానం అన్న శైలజానాథ్ ఇప్పుడు చర్చ అనడమేమిటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు వీలైనంత త్వరగా బిల్లును పంపించాలని చూస్తున్నారని, సమైక్య తీర్మానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు.
హజారే కంటే నేనే: శంకర రావు
అవినీతి పైన అన్నా హజారే కంటే తానే ఎక్కువ పోరాటం చేశానని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యులు శంకర రావు వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీ బతికి బట్టకట్టదన్నారు. షెడ్యూలు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పైన చర్చ జరుగుతోందని కాబట్టి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశముందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications