YS Viveka Case : అవినాష్ అరెస్ట్ తప్పదు, 10 మంది ఎమ్మెల్యేల రాజీనామా..!?
కడప జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు వివేకా హత్య కేసు హాట్ టాపిక్ గా మారుతోంది. కడప ఎంపీ అవినాష్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇక అరెస్ట్ ఖాయం అంటూ ప్రత్యర్ధి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ భాస్కర రెడ్డి అరెస్ట్ తో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. పులివెందులలోనే అవినాష్ రెడ్డి మకాం వేసారు. రేపు హైకోర్టులో అవినాష్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కీలక వ్యాఖ్యలు చేసారు.
హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటీషన్ పైన గురువారం విచారణ కొనసాగనుంది. పులివెందుల చేరుకున్న అవినాష్ ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. హైకోర్టులో విచారణ తరువాత కోర్టు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా సీబీఐ నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ సునీత, రాజశేఖర రెడ్డిని సీబీఐ విచారణ చేస్తోంది. పులివెందులలో దస్తగిరి భద్రత పైనా సీబీఐ ఆరా తీస్తోంది. ఈ సమయంలోనే అవినాష్ చుట్టూ సీబీఐ అడుగులు కడప జిల్లా వైసీపీ నేతల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక ప్రతిపాదన చేసారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎంపీ అవినాష్ రెడ్డి పైన కుట్ర సాగుతోందన్నారు.అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే అభిప్రాయం బలంగా వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కేసుతో అవినాష్ కు సంబంధం లేదని తాను గతంలోనే చెప్పానన్నారు. ఈ కేసులో నిందితుడుగా విచారణ చేసింతన మాత్రాన నేరస్థుడు కాదన్నారు. చంద్రబాబు వెనుక ఉండి ఈ కేసులో కుట్ర చేసి అవినాష్ ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేసారని ఆరోపించారు. తాను గతంలోనే చెప్పిన విధంగా అవినాష్ రెడ్డి నేరస్థుడిగా రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తనతో పాటుగా జిల్లాలోని మిగిలిన తొమ్మది మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పానని రాచమల్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications